Taliban leader: తాలిబన్ల బరితెగింపు! తొలి సారిగా బయటికొచ్చిన తాలిబన్ల నాయకుడి ఫొటో.. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌!

అఫ్గనిస్తాన్‌ (Afghanistan) తమ ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబన్లు బరితెగించి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు (మార్చి 5) తాలిబన్ల నాయకుడు, అంతర్జాతీయ తీవ్రవాది సిరాజుద్దీన్ హక్కానీ (Sirajuddin Haqqani) ఈ వేడుకలకు బహిరంగంగా హాజరయ్యాడు. దీంతో మొదటిసారిగా..

Taliban leader: తాలిబన్ల బరితెగింపు! తొలి సారిగా బయటికొచ్చిన తాలిబన్ల నాయకుడి ఫొటో.. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌!
Taliban Leader
Follow us

|

Updated on: Mar 05, 2022 | 9:13 PM

Taliban leader Sirajuddin Haqqani makes first public appearance: అఫ్గనిస్తాన్‌ తమ ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబన్లు బరితెగించి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అఫ్గన్‌లో చొరబడ్డ తాలిబన్లలో కొందరు పోలీస్‌ శిక్షణ తీసుకున్నారు. మొదటి బ్యాచ్‌కు శిక్షణ పూర్తయిన నేపథ్యంలో తాలిబన్లు ఈ రోజు (మార్చి 5) గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు తాలిబన్ల నాయకుడు, అంతర్జాతీయ తీవ్రవాది సిరాజుద్దీన్ హక్కానీ (Sirajuddin Haqqani) హాజరయ్యాడు. దీంతో మొదటిసారిగా అతని ఫొటో ప్రపంచం ముంగిట కొచ్చింది. టెర్రరిస్టుగా పేరుగాంచిన తాలిబాన్ యాక్టింగ్ ఇంటీరియర్ మినిస్టర్ (Taliban acting interior minister) హక్కానీ బహిరంగంగా బయటికి రావడంతో సర్వత్రా చర్చకొనసాగుతోంది. అంతేకాదు అతని సంబంధించిన ఫొటోలను కూడా తాలిమన్లు తమ అధికారిక ఛానెళ్లలో ప్రచురించారు. ఐతే ఆ ఫొటోలు క్లియర్‌గాలేకుండా అస్పష్టంగా ఉన్నాయి. అఫ్గన్‌కు అంతర్గత మంత్రిగా ఎంపికైన తర్వాత హక్కానీ మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి.

గతంలో తాలిబాన్లు అఫ్గన్‌ ప్రజలను హించారు. ఐతే వారందరికి ప్రస్తుతం పోలీస్‌ ట్రైనింగ్‌ ఇచ్చామని, వీరంతా అఫ్గన్‌ ప్రజలను కాపాడుతారని, తాలిబన్లు ఇకపై ఎలాంటి అరాచకాలకు పాల్పడరని, అఫ్గన్‌ ప్రజలపై నేరాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఈ వేడుకలో హక్కానీ ప్రసంగించాడు. ఈ శిక్షణలో మొత్తం స్త్రీ, పురుషులతో కలిపి దాదాపు 377 మంది పట్టభద్రులయ్యినట్టు సమాచారం. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజం తమ ప్రభుత్వాన్ని తప్పుపట్టకూడదని, దేశాన్ని పునరుద్ధరించేందుకు విదేశీ సాయం అవసరమని అన్నాడు. అప్గన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు గత ఏడాది ఫిబ్రవరిలో తాలిబాన్లకు, అమెరికాకు మధ్య కుదిరిన దోహా శాంతి ఒప్పందానికి (Doha peace agreement) తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నాడు. అల్-ఖైదా వంటి తీవ్రవాద సమూహాలకు అఫ్గన్‌ అడ్డాగా మరకుండా నిరోధించడానికి అంతర్జాతీయ భద్రతా సంస్థల సహాకారం అవసరమని, కరువు, ఆకలితో అలమటిస్తున్న అఫ్టన్‌ ప్రజలను ఆదుకొనేందుకు ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్‌లో స్థంభించిన బిలియన్‌ డాలర్ల నిల్వలను విడుదల చేయాలని హక్కానీ ఈ ప్రసంగంలో కోరాడు. మరోవైపు అంతర్జాతీయ తీవ్రవాదిగా పేరుగాంచిన హక్కానిని పట్టించిన వారికి 10 మిలియన్‌ డాలర్ల బహుమతిని అమెరికా Federal Bureau of Investigation ప్రకటించింది.

Also Read:

వింత! 7 తరాల తర్వాత ఆడపిల్ల పుట్టిందని.. ఏకంగా చందమామపై ఎకరం భూమిని కొని గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రలు!