పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్యకి నాని ఏం సమాధానం చెప్పాడంటే.. ఆకట్టుకుంటోన్న శ్యామ్ సింగరాయ్ డిలీటెడ్ సీన్..

పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్యకి నాని ఏం సమాధానం చెప్పాడంటే.. ఆకట్టుకుంటోన్న శ్యామ్ సింగరాయ్ డిలీటెడ్ సీన్..
Nani

న్యేచురల్ స్టార్ నాని.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో వచ్చిన తాజా  చిత్రం 'శ్యామ్ సింగరాయ్.  నాని సరసనసాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు

Basha Shek

| Edited By: Venkata Chari

Jan 23, 2022 | 2:04 PM

న్యేచురల్ స్టార్ నాని.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో వచ్చిన తాజా  చిత్రం ‘శ్యామ్ సింగరాయ్.  నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నిహారిక నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా  కలకత్తా బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది.  తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ భాషలలో మంచి కలెక్షన్లు వచ్చాయి.  థియేటర్లలోనే కాకుండా ప్రస్తుతం ఓటీటీలో కూడా  ప్రేక్షకులను మెప్పిస్తోందీ చిత్రం.  కాగా ఈ సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ హనుమ విహారి వంటి  ప్రముఖులు చిత్ర బృందంపై ప్రశంసలు వర్షం కురిపించిన వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

ఆరోజు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో డిలీట్ చేసిన ఒక సీన్ ను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది చిత్రబృందం.  ఈ సీన్‌లో వేశ్యలందరినీ ఒక చోట కూర్చోబెట్టిన శ్యామ్ సింగరాయ్ .. వారిపై తను రాసిన లేఖను చదివి వినిపిస్తుంటారు. అందులో ఒక వేశ్య..  ‘ఇంత తెలిసిన నీవు.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడుగుతుంది. దీనికి శ్యామ్  ‘కచ్చితంగా చేసుకుంటాను.. నిన్ను ప్రేమించిన రోజు’ అని సమాధానమిస్తాడు. ఈ సీన్ చూడడానికి  ఎంతో బాగుంది. ఈ సీన్ కూడా సినిమాలో ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు . మరి దీనిని సినిమా నుంచి ఎందుకు తీసేశారో.. చిత్ర బృందానికే తెలియాలి.

Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..

RECPDCL Recruitment: బీటెక్‌, ఎంబీఏ అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..

Casino Game: కేసినో నిర్వహణపై టీడీపీ-వైఎస్ఆర్​సీపీల మధ్య మాటల యుద్ధం.. చట్టం ఏం చెబుతోంది..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu