AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RECPDCL Recruitment: బీటెక్‌, ఎంబీఏ అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..

RECPDCL Recruitment: ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్ ప‌లు ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీచేసింది. భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు...

RECPDCL Recruitment: బీటెక్‌, ఎంబీఏ అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..
Narender Vaitla
|

Updated on: Jan 22, 2022 | 10:05 PM

Share

RECPDCL Recruitment: ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్ ప‌లు ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీచేసింది. భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో ఎగ్జిక్యూటివ్‌ (టెక్నికల్‌-ఎలక్ట్రికల్‌, సివిల్‌) 07, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ (హెచ్ఆర్‌) 01, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ (టెక్నికల్‌-ఎలక్ట్రికల్‌, సివిల్‌) 04 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ (హెచ్‌ఆర్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవంతో పాటుటెక్నిక‌ల్ నాలెడ్జ్ త‌ప్ప‌నిస‌రి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు పోస్టుల ఆధారంగా 40 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు నెల‌కు రూ. 1,12,000, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ. 85000 చెల్లిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను ముందుగా అక‌డ‌మిక్, ప‌ని అనుభ‌వం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంరం ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ 22-01-2022న ప్రారంభం కాగా చివరి తేదీగా 21-02-2022ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Memory Power: పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా.. ఈ 5 ఆహారాలు వారి డైట్‌లో చేర్చండి..

UP Elections 2022: యోగి బాటనే ఎంచుకున్న అఖిలేశ్.. ఇంకా సందిగ్ధంలోనే ప్రియాంక..

Amit Shah: జమ్మూ, కశ్మీర్‌‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు.. కీలక వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా

Follow Us
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా చేసుకునే ఇన్‌స్టంట్ రెసిపీ ఇదీ!
తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా చేసుకునే ఇన్‌స్టంట్ రెసిపీ ఇదీ!
తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!
తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!