Lata Mangeshkar: పెద్ద మనసు చాటుకున్న ముంబయి ఆటో డ్రైవర్.. లతా మంగేష్కర్ చికిత్స కోసం..
తన మధురమైన గాత్రంలో కోట్లాదిమంది సంగీతాభిమానుల హృదయాలు గెల్చుకున్నారు ప్రముఖ గాయని లతామంగేష్కర్.
తన మధురమైన గాత్రంలో కోట్లాదిమంది సంగీతాభిమానుల హృదయాలు గెల్చుకున్నారు ప్రముఖ గాయని లతామంగేష్కర్. కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆమె గొంతుకు అభిమానులున్నారు. అలాంటి గాయని ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారు. ఈనెల 8న కరోనా బారిన పడిన ఆమె ప్రస్తుతం ముంబయి బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వయసు రీత్యా ఐసీయూలో ఉంచి ఆమెకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు వైద్యులు. కాగా మంగేష్కర్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయికి చెందిన ఓ ఆటో డ్రైవర్.. లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను విరాళంగా ఇచ్చాడు.
ఆటోనిండా ఆమె బొమ్మలే..
ముంబయి పట్టణంలో నివసించే సత్యవాన్ గీతే లతా మంగేష్కర్‌కి పెద్ద అభిమాని. లతామంగేష్కర్‌ను అతను సరస్వతి దేవి రూపంగా భావిస్తాడు. అందుకే తన జీవనాధారమైన ఆటోను కూడా గాయని బొమ్మలతోనే అందంగా అలంకరించాడు. తన ఆటోలో కూడా ఆమె ఆలపించిన పాటలే ఉంటాయి. కాగా లతా మంగేష్కర్ కరోనాతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచిఆమె త్వరగా కోలుకోవాలని నిరంతరం ప్రార్థనలు చేస్తున్నాడు సత్యవాన్ . ఈక్రమంలోనే మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను దానం చేశాడు. కాగా లత ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను నమ్మ వద్దని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..