Sonakshi Sinha: సోనాక్షి మతాంతర వివాహంపై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తండ్రి శత్రుఘ్న సిన్హా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కొన్నిరోజుల క్రితం వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ప్రముఖ నటుడు జహీర్ ఇక్బాల్‌ను ఆమె మతాంతర వివాహం చేసుకుంది. దీంతో చాలామంది సోనాక్షిని విమర్శిస్తున్నారు. నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వీటిపై సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ఘాటుగా స్పందించాడు.

Sonakshi Sinha: సోనాక్షి మతాంతర వివాహంపై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తండ్రి శత్రుఘ్న సిన్హా
Sonakshi Sinha
Follow us
Basha Shek

|

Updated on: Dec 29, 2024 | 1:13 PM

కొన్ని రోజుల క్రితం ‘శక్తిమాన్’నటుడు ముఖేష్ ఖన్నా నటి సోనాక్షి సిన్హా టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోపతి’ షోలో రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది. ఆఈ కారణంగా ముఖేష్ ఖన్నా సోనాక్షిని, ఆమె పెంపకాన్ని విమర్శించాడు. ఆ తర్వాత నెట్టింట ట్రోల్స్ రావడంతో తన మాటలపై విచారం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించనని స్పష్టం చేశారు. ఈ విషయం ముగియగానే ప్రముఖ కవి కుమార్ విశ్వాస్ ఓ కార్యక్రమంలో సోనాక్షి మతాంతర వివాహంపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో శతృఘ్న సిన్హా రంగంలోకి దిగారు. తన కూతురి పెళ్లిపై వస్తోన్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ, ‘మీ పిల్లలకు సీతాజీ, ఆమె సోదరీమణుల పేర్లు, రాముడి తోబుట్టువుల పేర్లు చెప్పండి. అలాగే మీ పిల్లలను రామాయణం వినేలా చేయండి. గీతా పఠనం చేయించండి. పఠించండి. మీ ఇంటి పేరు రామాయణం. అయితే మీ ఇంటి లక్ష్మిని వేరొకరు తీసుకెళ్లారు’ అంటూ పరోక్షంగా సోనాక్షి పెళ్లిని ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

శత్రుఘ్న సిన్హా  ట్వీట్..

సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్‌ను మతాంతర వివాహం చేసుకుంది. ఇప్పుడు దీనినే కుమార్ విశ్వాస్ టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. ‘మీ పరిశీలన, సమాచారం కోసం నేను కొన్ని ఇటీవలి సంఘటనలు, ప్రకటనలు, ప్రతిచర్యలలో కొంత భాగాన్ని ఇక్కడ జత చేస్తున్నాను. నా కన్మణి..నా కూతురు సోనాక్షి సిన్హాకు నా పూర్తి మద్దతు, ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నా కుమార్తె ఈ విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరించుకుంటుందని తెలుసు. అలాగే నా కూతురి పెళ్లి విషయంలో రాజకీయ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఇచ్చిన స్పందన పట్ల నేను సంతోషిస్తున్నాను. ‘ఈ విషయాన్ని సోనాక్షి, మేం పరిష్కరించాం. ఇంకేమైనా చెప్పాలా? మీ సమాచారం కోసం నేను ఇక్కడ వివిధ అంశాలను పంచుకుంటున్నాను. జై హింద్!’ అని రాసుకొచ్చారు శత్రుఘ్న సిన్హా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..