AP News: ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే.?

ఏపీలో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు చేపట్టిన చంద్రబాబు సర్కారు..అమలు తేదీని ఫిక్స్‌ చేసింది. రిజిస్ట్రేషన్‌ చార్జీలు సగటున 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందన్న ప్రభుత్వం.. చరిత్రలో తొలిసారిగా కొన్నిప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ విలువలను తగ్గించబోతున్నట్టు ప్రకటించింది.

AP News: ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే.?
Ap Registrations
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 01, 2025 | 7:46 AM

ఫిబ్రవరి-1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతామని ప్రకటించింది..ఏపీ ప్రభుత్వం. రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్‌ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి అనగాని సత్యప్రసాద్.. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ర్టేషన్ చార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంచుతామని.. జనవరి 15 నాటికి అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ర్టేషన్ విలువలను తగ్గించబోతున్నామని చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పెంపుదలగానీ..తగ్గింపు కానీ ఉండదని యథాతథంగా ఉంటాయన్నారు. గత ప్రభుత్వం శాస్ర్తీయ పద్దతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్ర్టేషన్ విలువలు పెంచిందని ఆరోపించిన మంత్రి..ఆ పొరపాట్లను ఇప్పుడు సరి చేస్తామని చెప్పారు.

వాస్తవానికి జనవరి 1 నుంచి రిజిస్ర్టేషన్ చార్జీలు సవరించాలని భావించింది ఏపీ ప్రభుత్వం. అయితే పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీ వాయిదా వేసింది. భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి, ప్రజాభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. భూములకు ఉన్న డిమాండ్‌, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని చెప్పింది.

ఏపీలో గత ఐదేళ్లలో భూముల మార్కెట్‌ రిజిస్ట్రేషన్‌ ధరలు పలుమార్లు పెరిగాయి. దీంతో పట్టణాల్లో రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలకు సమానంగా చేరాయి. ఈ క్రమంలో ఏరియాల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చార్జీలను హేతుబద్దీకరిస్తామని చెబుతోంది ప్రభుత్వం. సాధారణంగా ప్రభుత్వ లెక్కల్లో ఉండే భూమి విలువకు..బహిరంగ మార్కెట్‌లో ఉండే విలువకు వ్యత్యాసం ఉంటుంది. ఈ విధానంలో భూమి కొనుగోలు చేసే వారికి తక్కువ ధరకు నివాస భూమి లభించడంతో పాటు అమ్మే వారికి లాభసాటిగా ఉండేది. ఈ విధానంలో ఆదాయాన్ని కోల్పోతున్నామని గుర్తించిన ప్రభుత్వం..రిజిస్ట్రేషన్‌ విలువలను ఎప్పటికప్పుడు సవరిస్తోంది. మరోవైపు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరగనున్ననేపథ్యంలో..రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెబుతున్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?