Gold Price Today: న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
భారతీయుల్లో బంగారంపై మోజు.. అది ఎప్పటికి తగ్గని క్రేజు. న్యూ ఇయర్‌లో తులం బంగారం రేటు పైపైకి ఎగబాకి రూ. 90 వేలకు చేరుతుందా? ట్రంప్ రాక, రూపాయి బలహీనత.. పసిడిని పరుగులు పెట్టిస్తాయా? లేక గోల్డెన్ డేస్ కంటిన్యూ అవుతాయా?
కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయ్.? ఇప్పుడు మగువల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. 2024 చివరి రోజున, ఇయర్ ఎండ్‌లో బంగారం రేట్లు స్వల్పంగా తగ్గి, పసిడి ప్రియులకు గోల్డెన్ న్యూస్ అందించాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో.. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉంది. ఇక 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 77,560కి తగ్గింది. క్రితం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 తగ్గింది. ఇక ఆ పంథానే కొనసాగిస్తూ.. వరుసగా రెండో రోజు తగ్గాయి పసిడి ధరలు. ఈ రెండు రోజుల్లో బంగారం ధరలు రూ. 450 మేరకు తగ్గగా.. వెండి ధరలు ఏకంగా రూ. 2100 తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుముఖం పట్టడంతోనే.. దేశీయంగా పసిడి నేల చూపులు చూస్తోందని నిపుణులు అంటున్నారు. మరి కొత్త సంవత్సరం వేళ దేశంలోని పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఢిల్లీ:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,240
24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,700
ముంబై:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,090
24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,550
కోల్‌కతా:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,090
24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,550
చెన్నై:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,090
24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,550
బెంగళూరు:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,090
24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,550
ఇక తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,550 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,090గా కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
బంగారం బాటలోనే వెండి దారు కూడా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా వెండి ధరలు ఏకంగా రూ. 2200 మేరకు తగ్గాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్, కేరళ, చెన్నైలో కేజీ వెండి ధర రూ. 97,900 కాగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 90,400గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి