AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana DEET: నిరుద్యోగులకు బలేఛాన్స్.. ప్రైవేటు ఉద్యోగాలకు డీఈఈటీలో నమోదుకు పరిశ్రమల శాఖ పిలుపు

పెద్ద పెద్ద చదువులు చదివి.. చేసేందుకు ఉద్యోగం దొరక్క.. కన్నవారికి భారంగా బతకలేక బతుకీడుస్తున్న యువతకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. అదేంటంటే ‘డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీఈఈటీ) యాప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు మీ కళ్లముందుకు వస్తాయి. అంతే క్షణంలో నచ్చిన ఉద్యోగంలో చేరిపోవచ్చు.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి..

Telangana DEET: నిరుద్యోగులకు బలేఛాన్స్.. ప్రైవేటు ఉద్యోగాలకు డీఈఈటీలో నమోదుకు పరిశ్రమల శాఖ పిలుపు
Telangana DEET
Srilakshmi C
|

Updated on: Jan 01, 2025 | 7:26 AM

Share

హైదరాబాద్‌, జనవరి 1: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిందే ‘డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీఈఈటీ). ఇందులో నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని పరిశ్రమల శాఖ తెలిపింది. తొలుత వ్యక్తిగత వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్‌ నంబర్, పాస్‌ వర్డ్ ద్వారా లాగిన్‌ కావాలి. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో కూడిన ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో ఎలాంటి ఖర్చులు లేకుండా ఉచితంగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అయితే డీఈఈటీ రిజిస్ట్రేషన్‌లో ఉద్యోగార్థులు ప్రాథమిక సమాచారంతో పాటు విద్యార్హతలు, నైపుణ్యాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా వ్యక్తిగత రెజ్యూమె అందుబాటులోకి వస్తుంది. దీంతో నిరుద్యోగుల స్థిర నివాసం, విద్యార్హతల ఆధారంగా ఖాళీ ఉద్యోగాల సమాచారం ఈ యాప్‌ అందిస్తుంది. తయారీ, ఐటీ, ఫార్మా, వ్యవసాయ తదితర రంగాలకు సంబంధించిన ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు ఖాళీల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాయి. ఈ యాప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు డీఈఈటీ యాప్‌ లేదా  అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. నిరుద్యోగ యువతకు ఇదొక సువర్ణావకాశం. ఒకేచోట ఉద్యోగ ఖాళీల వివరాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా నచ్చిన ఉద్యోగంలో చేరవచ్చని డీఈఈటీ సంస్థ చెబుతుంది.

ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ ఎస్సై పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష 2024కు సంబంధించి పేపర్‌ 2 పరీక్ష తేదీ తాజాగా విడుదలైంది. ఈ పరీక్ష మార్చి8న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలలో 4,187 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.