Shanmukh Jaswanth: ఇంకా దీప్తి ఆలోచనల్లోనే షణ్ణూ.. ప్రేమ గీతాలు వింటూ బ్రేకప్ హార్ట్ ఎమోజీని షేర్ చేసిన యూట్యూబ్ స్టార్..
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్ స్టార్‌గా ఎంతోమంది అభిమానం సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth). ఆ పాపులారిటీతోనే బిగ్‌బాస్ ( Bigg Boss) హౌస్‌లోకి అడుగుపెట్టాడు
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్ స్టార్‌గా ఎంతోమంది అభిమానం సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth). ఆ పాపులారిటీతోనే బిగ్‌బాస్ ( Bigg Boss) హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ప్రారంభం నుంచి టైటిల్ ఫేవరేట్ గానే నిలిచాడు. ఫిజికల్ టాస్క్‌లు, గేమ్స్ సరిగా ఆడకపోయినా షణ్ణూనే బిగ్‌బాస్ విజేత అని చాలామంది భావించారు. ఎందుకంటే సోషల్ మీడియాలో అతనికి మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ బిగ్‌బాస్ షో ముందుకు సాగే కొద్దీ అతని ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. తోటి కంటెస్టెంట్ సిరితో హద్దులు దాటి ప్రవర్తించడంతో పూర్తి నెగెటివిటీ వచ్చింది. ఇమేజ్ సంగతి పక్కన పెడితే మొదటి నుంచి ప్రేమగా ఉంటున్న దీప్తి సునయన (Deepthi Sunaina) కూడా దూరమైంది. అతనికి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
కాగా ఈ బ్రేకప్ తర్వాత దీప్తి తన పనుల్లో తను బిజీగా మారిపోయింది. స్నేహితులను కలుస్తూ ఆ ఫొటోలను నెట్టింట్లో పంచకుంటోంది. షణ్ణూ మాత్రం దీప్తి మర్చిపోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందుకు అతని ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు, పోస్టులే నిదర్శనం. నిత్యం తన ప్రేయసిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. అలా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో విరహ గీతాలు వింటూ బ్రేకప్ హార్ట్ ఎమోజీని జత చేస్తూ తన ఆవేదనను పంచుకున్నాడు షణ్ణూ. దీనిపై అతని సోదరుడు సంపత్ వినయ్ స్పందించాడు. ‘ఈ వయసులో ప్రేమ, బ్రేకప్ ఏంటి.. చదువుకోండి ఫస్టు. మా లాంటి వాళ్లకు ఇలు, అమ్మా నాన్నలు, స్నేహితుల దగ్గరే ప్రేమ దొరుకుతుంది. కానీ నీలాంటి వాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ ఉంది. మున్ముందు దేశం మొత్తం నిన్ను ప్రేమిస్తుంది’ అని రాసుకొచ్చాడు. దీనికి రిప్లైగా ‘ నా బాధ నీకేం తెలుసు’ అన్నట్లుగా ఎమోజీ పెట్టాడు షణ్ణూ. ఇలా అన్నదమ్ములు డిస్కషన్ చేసుకుంటుంటే మధ్యలో మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్ ఎంటరయ్యాడు. ‘హ్యాపీ ప్రపోజ్ డే’ అంటూ షణ్ముఖ్‌ను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ‘ మా సింగిల్స్ దగ్గర తప్పు తప్పుగా మాట్లాడొద్దు’ అని రిప్లై ఇవ్వగా.. ‘హలో నేను కూడా సింగిలే..’ అంటూ బదులిచ్చాడు మానస్.
Mahesh Babu: పెళ్లిరోజు సందర్భంగా అందమైన ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన మహేష్ ..