AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎర్రబుగ్గ కార్ల వినియోగంపై హైకోర్టు కీలక ఆదేశాలు.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ..

ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా, అర్హత లేకపోయినా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకుని ప్రయాణించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ( High Court) రాష్ట్ర ప్రభుత్వాని (Telangana Goverbnebt) కి కీలక ఆదేశాలు జారీ చేసింది.

Telangana: ఎర్రబుగ్గ కార్ల వినియోగంపై  హైకోర్టు కీలక ఆదేశాలు.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ..
Basha Shek
|

Updated on: Feb 10, 2022 | 11:34 AM

Share

ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా, అర్హత లేకపోయినా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకుని ప్రయాణించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ( High Court) రాష్ట్ర ప్రభుత్వాని (Telangana Goverbnebt) కి కీలక ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఎర్రబుగ్గల వాడకంపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా చాలా మంది ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఎర్రబుగ్గ కార్లను వినియోగిస్తున్నారంటూ మహబూబ్‌ నగర్‌కు చెందిన న్యాయవాది భావనప్ప హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అదే సమయంలో ఎర్ర బుగ్గల కార్ల వినియోగానికి సంబంధించి రాష్ట్రంలో రూల్స్​పక్కాగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం కౌంటర్‌ కూడా‌‌‌ దాఖలు చేసింది. వీటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

సుప్రీం ఆదేశాలను అమలు చేయాలి.. ‘మోటారు వాహనాల చట్టంలోని 119 సెక్షన్‌కు వ్యతిరేకంగా చాలామంది ఎర్రబుగ్గ కార్లు వినియోగిస్తున్నారు. వీటివల్ల తోటి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అంతేకాదు శబ్ధ కాలుష్యం కూడా భారీగా పెరుగుతోంది. ఎర్రబుగ్గ కార్ల వినియోగంలో సుప్రీం జారీ చేసిన ఆదేశాలను తప్పక పాటించాలి’ అని ఈ సందర్భంగా హైకోర్టులో తన వాదనలు వినిపించారు పిటిషనర్‌. కాగా ఇరువైపులా వాదనలు విన్న రాష్ట్ర ధర్మాసనం ఎర్రబుగ్గ కార్ల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి కార్ల వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా వీటికి ఉపయోగించే సైరన్ల విషయంలో అవసరమైతే మోటారు వాహనాల చట్టాన్ని అమలు చేయాలని ధర్మాసనం సర్కారుకు ఆదేశాలిచ్చింది. ఈక్రమంలో ఎర్రబుగ్గ కార్ల వినియోగానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ పిల్‌పై విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది.

Also Read:Mahesh Babu: పెళ్లిరోజు సందర్భంగా అందమైన ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన మహేష్ ..

Coronavirus: దేశంలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. మరణాలు మాత్రం పైపైకి.. నిన్న ఎంత మంది చనిపోయారంటే..

CM Jagan-Tollywood: సీఎం భేటీకి ముందు చర్చనీయాంశంగా మారిన అక్కినేని నాగార్జున వ్యవహారం.. జగన్‌తో సమావేశానికి దూరం..