క్రేజీ కాంబినేషన్ నుంచి అప్‏డేట్.. కేజీఎఫ్ హీరోతో కలిసి భారీ చారిత్రాత్మక సినిమా తీయనున్న శంకర్ ?

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‍గా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యశ్. ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మరోసారి యశ్‏తో

క్రేజీ కాంబినేషన్ నుంచి అప్‏డేట్.. కేజీఎఫ్ హీరోతో కలిసి భారీ చారిత్రాత్మక సినిమా తీయనున్న శంకర్ ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 21, 2021 | 6:50 PM

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‍గా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యశ్. ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మరోసారి యశ్‏తో కలిసి ‘కేజీఎఫ్-2’ ను తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలై ఈ టీజర్‏ యూట్యూబ్‏లో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరోతో డైరెక్టర్ శంకర్ ఓ సినిమా తీయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో శంకర్ ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు ఈ టాప్ డైరెక్టర్. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్‏తో భారతీయుడు 2 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‏లో క్రేన్ యాక్సిడెంట్ అవడంతోపాటు కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడింది. ఇక మళ్ళీ త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత శంకర్ ఓ భారీ చారిత్రాత్మక సినిమాను తీయాలని భావిస్తున్నారట. అందులో కేజీఎఫ్ హీరో యశ్‏ను తీసుకోవాలని.. ఇప్పటికే ఆయనకు కథ కూడా వినిపించారట. ఇందుకు యశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా సమాచారం. అయితే తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలోకి విజయ్ సేతుపతిని సెలక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక మిగతా భాషలకు ఆ కీలక పాత్ర కోసం ఆయా భాషల స్టార్స్‏ను తీసుకోనున్నట్లుగా తెలిస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలో వెలువడనున్నట్లుగా సమాచారం.

Also Read:

అల్లు అర్జున్ డ్యాన్స్‏కి బాలీవుడ్ హీరో ఫిదా.. నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను అంటున్న స్టార్..

Mahesh Babu: మహేష్‌ బాబు స్టన్నింగ్‌ లుక్ వెనక ఉంది ఎవరో తెలుసా..? వైరల్‌గా మారిన ప్రిన్స్‌ స్కిన్‌ స్పెషలిస్ట్‌ ఫొటో..