నిర్మాతగా మారిన టాప్ కమెడియన్.. కీలకపాత్రల్లో నటించనున్న స్టార్ ప్రొడ్యుసర్, డైరెక్టర్..

నిర్మాతగా మారిన టాప్ కమెడియన్.. కీలకపాత్రల్లో నటించనున్న స్టార్ ప్రొడ్యుసర్, డైరెక్టర్..

తెలుగు ఇండస్ట్రీలో టాప్ కమెడియన్స్‏లలో ఆలీ ఒకరు. దాదాపు ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. తన కామెడీతో థియేటర్లలో నవ్వులు

Rajitha Chanti

|

Jan 21, 2021 | 5:23 PM

తెలుగు ఇండస్ట్రీలో టాప్ కమెడియన్స్‏లలో ఆలీ ఒకరు. దాదాపు ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. తన కామెడీతో థియేటర్లలో నవ్వులు పూయిస్తాడు. తాజాగా ఆలీ నిర్మాతగా మారారు. ఆలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే సినిమా నిర్మిస్తున్నాడు ఆలీ. అంతేకాకుండా అదే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాకుండా తనకు చిత్రపరిశ్రమలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణరెడ్డిలు ఈ సినిమా అతిథి పాత్రల్లో నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ మూవీ మొదటి దశ షూటింగ్‏లో అచ్చి రెడ్డి, సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వీరు ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సందర్బంగా ఆలీ మాట్లాడుతూ.. “నన్ను హీరోగా పరిచయం చేసి నా కెరీర్‏ను మలుపు తిప్పిన అచ్చిరెడ్డి, కృష్ణా రెడ్డి గార్లు మళ్ళీ నేను నిర్మాతగా మారి తీస్తున్న సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నా మీద అభిమానంతో ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో అబాన్, మౌర్యాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. నటుడు నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 2019లో మలయాళ చిత్రం ‘వికృతి’కి రీమేక్‏గా ఈ మూవీ తీస్తున్నారు.

Also Read:

Pooja Hegde: దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ అక్కడ అడుగుపెట్టేందుకు ‘బుట్టబొమ్మ’ రెడీ..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu