స్టార్ హీరో సినిమాలో నటించనున్న నాని హీరోయిన్.. పల్లెటూరి అమ్మాయిగా రానున్న చెన్నై బ్యూటీ ?
నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంకా అరుళ్ మోహన్. తన నటనతో
నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంకా అరుళ్ మోహన్. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇక ఆ తర్వాత యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘శ్రీకారం’ సినిమాలో నటిస్తోంది ఈ చెన్నై బ్యూటీ. అంతేకాకుండా శివకార్తికేయన్‌తో కలిసి డాక్టర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీతో తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ మరో స్టార్ హీరోతో జతకట్టే ఛాన్స్ కొట్టేసిందట.
తమిళ స్టార్ హీరోయ సూర్య, డైరెక్టర్ పాండిరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతేడాది చివరిదశలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చినప్పుటినుంచి.. ఇందులో సూర్య సరసన ఎవరు నటించబోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ ఎంపికైనట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. రూరల్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో ప్రియాంక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట.
Also Read:
‘లోఫర్’ బ్యూటీ ప్రాణాలకు ముప్పుందా.? చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్.!