మరో సినిమాను అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. టైటిల్ లోగో పోస్టర్ను విడుదల చేసిన చిత్రయూనిట్..
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'వరుడు కావలెను', 'లక్ష్య' సినిమాల్లో నటిస్తూ ఫుల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాతో కె.పి.రాజేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా నాగశౌర్య కెరీర్లో 23వ సినిమా ఇది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శుక్రవారం నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఇక దీనికి ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తర్వలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
A new story begins! Here’s revealing the title and logo of @IamNagashaurya’s #PoliceVaariHecharika. Get ready for an amazing experience.
Directed by K P Rajendra @rajendrakolusu Produced By @smkoneru @eastcoastprdns #NS23#HappyBirthdayNagaShaurya pic.twitter.com/c2DxMxz8Uf
— BARaju (@baraju_SuperHit) January 21, 2021
Also Read:
స్టార్ హీరో సినిమాలో నటించనున్న నాని హీరోయిన్.. పల్లెటూరి అమ్మాయిగా రానున్న చెన్నై బ్యూటీ ?