’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ప్రేమ, హాస్యంతో ఆసక్తికరంగా ప్రదీప్ సినిమా..
టెలివిజన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. ఇప్పటికే ఈ సినిమా
టెలివిజన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నీలి నీలి ఆకాశం అనే సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన సంగతే. ఇందులో అమృతఅయ్యార్ హీరోయిన్గా నటిస్తుండగా.. మున్నా కొత్త దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు.
ఈ ట్రైలర్లో పునర్జన్మల లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లుగా తెలిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో హర్ష చెముడు, భద్రం, హేమ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ వీడియోలో ప్రదీప్, హర్ష కమెడి నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ సినిమా జనవరి 29న విడుదల కానుంది.
Also Read:
ఆ యంగ్ హీరోయిన్ను సెలక్ట్ చేసిన డైరెక్టర్.. వెంటనే నో చెప్పిన గోపీచంద్.. అసలు కారణం ఇదే..