మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా..? అంటూ తిట్టాడు.. అసలు విషయం బయటపెట్టిన నటి
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను భారీ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు.

ప్రముఖ నటి రమేశ్వరి గుర్తున్నారా..? సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘నిజం’ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించారు ఆమె.. అంతకు ముందు ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఇటీవలే దేవర సినిమాలో ఆమె నటించారు. దేవర సినిమాలో ఆమె కనిపించింది కొంతసేపే అయినా చాలా కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే రమేశ్వరి ఓ ఇంటర్వ్యూలో రమేశ్వరి నిజం సినిమా ముచ్చట్లను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మహేష్ బాబు తనను తిట్టారు అని కూడా అన్నారు రమేశ్వరి. ఆ విషయాలేంటో ఒక్కసారి చూద్దాం.!
దర్శకుడు తేజ నుంచి ఊహించని కాల్‌తో నిజం చిత్రంలోకి తన ఎంట్రీ జరిగిందని తెలిపారు రమేశ్వరి. వ్యక్తిగత విషాదంలో ఉన్న సమయంలో, తన తల్లిని కోల్పోయి మానసికంగా కుంగిపోయినప్పుడు, తన భర్త సూచన మేరకు బయటి ప్రపంచంలోకి రావాలని కోరుకున్నా.. సరిగ్గా అదే సమయంలో తేజ నుంచి ఈ ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు. తేజ తనకు ఫోన్ చేసి, ఒక పాత్ర ఉందని, ఇష్టమైతే చేయవచ్చని చెప్పారని రమేశ్వరి తెలిపారు. మొదట్లో హీరో ఎవరనే దానిపై తాను ఆసక్తి చూపలేదని, కేవలం పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. నిజం సినిమాలో ముందుగా ఆ పాత్రను మొదట రేఖ, జయసుధ వంటి వారికి ఆఫర్ చేశారని ఫైనల్ గా తనకు ఆఫర్ వచ్చిందని తెలిపారు. చిత్రం పూర్తయిన తర్వాత, తన పారితోషికం గురించి మహేష్ బాబు ఆమెను తిట్టారని రమేశ్వరి వెల్లడించారు.
ఏంటి ఇంత తక్కువ డబ్బుకి చేశారా మీరు, ఎవరైనా అసలు అడిగే మాటైనా లేదా? అని మహేష్ బాబు తనను నిలదీశారని చెప్పారు. తాను ఎప్పుడూ పారితోషికం గురించి పట్టించుకోలేదని, ఎంత అడగాలో తనకు తెలియదని, అధిక మొత్తాలు అడిగే అర్హత తనకు లేదని భావిస్తానని రమేశ్వరి పేర్కొన్నారు. అయితే, తాను పనిచేసినందుకు డీసెంట్ పారితోషికం ఆశిస్తానని స్పష్టం చేశారు. నిజం షూటింగ్ సమయంలో మహేష్ బాబు, తేజ తన డైలాగ్ డెలివరీ చూసి సరదాగా వెక్కిరించేవారని, తాను డైలాగ్స్ బాగా కంఫర్టబుల్‌గా అనిపించే వరకు చేస్తూనే ఉండేదాన్నని, పాత్రలో లీనమవ్వడమే తనకు ముఖ్యమని ఆమె వివరించారు. ఒక సన్నివేశంలో తన కళ్ల నుంచి రియల్ గా నీళ్లు ఎలా వచ్చాయని మహేష్ బాబు ఆశ్చర్యంతో అడిగారని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు తన నటనను చాలా మెచ్చుకున్నారని, ఆయన గొప్ప నటుడు అని రమేశ్వరి కితాబిచ్చారు. నిజం తర్వాత అవకాశాలు రాలేదని రమేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




