Jayamalini: నా కోరిక తీర్చమని అడిగింది ఆయన ఒక్కడినే.. జయమాలిని సంచలన కామెంట్స్..
సీనియర్ నటి జయమాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు... కానీ మూడు దశాబ్దాలపాటు సినిమా ప్రపంచంలో గ్లామర్ క్వీన్ గా ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా కాకుండా.. గ్లామర్ పాటలతోనే సంచలనం సృష్టించింది. అందం, స్పెషల్ సాంగ్స్ తో ఎక్కువగా ఆకట్టుకుంది.

సినీరంగంలో దాదాపు మూడు దశాబ్దాలపాటు చక్రం తిప్పిన గ్లామర్ క్వీన్ జయమాలిని. ఐదు వందలకు పైగా చిత్రాల్లో ముఖ్యపాత్రలు, స్పెషల్ పాటలతో రచ్చ చేసింది. అప్పట్లో గ్లామర్ సాంగ్స్ తో ఆకట్టుకుంది. కొన్ని పాటలతోనే ఆమె స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో స్టార్ హీరోహీరోయిన్లకు మించి క్రేజ్ సొంతం చేసుకుంది. జయమాలిని పాటలంటే పడి చచ్చేవాళ్లు. ఆమె నటించిన సినిమాల కోసం జనాలు ఎగబడేవారు. అంతటి పాపులారిటి సొంతం చేసుకుంది. ఒకప్పుడు తెలుగు సినిమాను ఊర్రూతలూగించిన నటి. గ్లామర్ పాత్రలతోనే అప్పట్లో వెండితెరపై సందడి చేసింది. హీరోయిన్లకు మించిన అభిమానులను సొంతం చేసుకుంది. ముప్పై ఏళ్లపాటు సినీరంగాన్ని శాసించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందం వల్ల ఎదురైన ఆకర్షణలు, కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసినట్లు వివరించారు.
నటి జయమాలిని తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గ్లామర్స్ లుక్స్ కారణంగా.. డ్యాన్స్ స్టెప్పులతో తనకు ఎప్పుడూ కొత్త పేర్లతో పిలిచేవారని అన్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువుల బాధ్యత తనపై ఉండటంతో ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మలయాళ సూపర్‌స్టార్ జయన్ నుండి వచ్చిన వివాహ ప్రతిపాదనను కూడా సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. జయన్ తన కుటుంబ సభ్యులను సంప్రదించి, ఇల్లు కూడా చూపించారని, కానీ కుటుంబం పట్ల తనకున్న బాధ్యతలే ప్రధానం కావడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు జయమాలిని వివరించారు. కొన్ని సినిమా సన్నివేశాలలో ఎదురైన అనుభవాలను కూడా ఆమె పంచుకున్నారు. తన జీవితంలో కుటుంబమే అత్యంత ముఖ్యమని జయమాలిని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
మలయాళ సూపర్ స్టార్ జయన్, జయమాలినిని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చిన సంఘటన గురించి ఆమె వెల్లడించారు. జయన్, ఆమె కంటే 20-22 సంవత్సరాలు పెద్దవారని, ఆయన నేరుగా తన దగ్గరకు రాకుండా, ఆమె తల్లిదండ్రులను సంప్రదించారని తెలిపారు. తమ కుటుంబాన్ని చూసుకుంటానని, జయమాలినిని పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇల్లు కూడా చూపించారని ఆమె వివరించారు. అయితే, ఆ సమయంలో కుటుంబ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని జయమాలిని ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ఒక సినిమాలో ఆమె సీనియర్ ఎన్టీఆర్ తో చేసిన సన్నివేశం తనకు ఎంత ఆశ్చర్యాన్ని గురి చేసిందని అన్నారు. ఓ పార్టీ మూడ్ లో ఉండగా.. ఎన్టీఆర్ సోఫాలో కుర్చూని ఉంటాడని.. విలన్ తో కలిసి జయమాలిని ఒక స్కెచ్ వేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ సైతం ఆమె తన లవర్ అని చెప్పాల్సిన సీన్ అది. అందులో ఎన్టీఆర్ ను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే తన కోరిక తీర్చమని జయమాలిని పాత్ర ఎన్టీఆర్ వెంటపడుతుందట. ఆ సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూసి షాకయ్యాయని.. యాక్టింగ్ సమయంలో తెలియదు కానీ.. ఆ సీన్స్ చూస్తూ తాను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
