AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 నెలల్లో 4 సినిమాలు! స్క్రీన్స్‌ షేక్ చేయడానికి రెడీగా ఉన్న యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా..?

టాలీవుడ్​లో అడుగుపెట్టింది మొదలు వరుస హిట్లతో ‘గోల్డెన్​ లెగ్​’ అని పేరు తెచ్చుకుంది. సినిమా ఏదైనా ఈ బ్యూటీ ఉంటే చాలు బాక్సాఫీస్​ వద్ద కాసుల పంటే. కథల ఎంపికలో జాగ్రత్తవహిస్తున్న ఈ బ్యూటీ అటు కోలీవుడ్​లోనూ ఇటు టాలీవుడ్​లోనూ స్టార్ హీరోల సరసన ..

4 నెలల్లో 4 సినిమాలు! స్క్రీన్స్‌ షేక్ చేయడానికి రెడీగా ఉన్న యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా..?
Young Beauty
Nikhil
|

Updated on: Nov 27, 2025 | 7:55 PM

Share

టాలీవుడ్​లో అడుగుపెట్టింది మొదలు వరుస హిట్లతో ‘గోల్డెన్​ లెగ్​’ అని పేరు తెచ్చుకుంది. సినిమా ఏదైనా ఈ బ్యూటీ ఉంటే చాలు బాక్సాఫీస్​ వద్ద కాసుల పంటే. కథల ఎంపికలో జాగ్రత్తవహిస్తున్న ఈ బ్యూటీ అటు కోలీవుడ్​లోనూ ఇటు టాలీవుడ్​లోనూ స్టార్ హీరోల సరసన ఛాన్స్​ కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం భారీ డిమాండ్​ ఉన్న భామల్లో ఒకరైన ఈ బ్యూటీ లైనప్​ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఎందుకంటే… రాబోయే నాలుగు నెలల్లోనే ఆమె నటిస్తున్న నాలుగు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒక్కో నెలకు ఒక్కో బిగ్ రిలీజ్… ఇది సాధారణ విషయం కాదు, సూపర్ స్టార్‌డమ్‌కు సంకేతం! ఇంతకీ అంత డిమాండ్ ఉన్న హీరోయిన్​ ఎవరు? ఏంటా సినిమాలు?

మాలీవుడ్​ నుంచి పాన్ ​ఇండియా స్థాయికి..

ఈ లక్కీ బ్యూటీ మరెవరో కాదు.. సంయుక్తా మేనన్! కేరళలో జన్మించి మలయాళంలో డెబ్యూ చేసిన ఈ బ్యూటీ, తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సెటిల్ అయింది. తెలుగులో ‘బింబిసార’,’సర్’, ‘విరూపాక్ష’.. గ్లామర్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ ఇచ్చాయి. ఇప్పుడు ఆమె బిజీ షెడ్యూల్ మామూలుగా లేదు.. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆమె డేట్ల కోసం తిరుగుతున్నారు. ఈ నాలుగు రిలీజ్‌లు ఆమె కెరీర్‌ను మరింత హైట్స్‌కు చేర్చుతాయని ఇండస్ట్రీ టాక్​.

మాలీవుడ్​ నుంచి పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగిన సంయుక్త… ఇప్పుడు తెలుగు, హిందీ ప్రేక్షకులను కూడా తన వైపు తిప్పుకుంది. ఆమె గ్లామర్, యాక్టింగ్, డాన్స్… అన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ ప్యాకేజీ. ఇప్పుడు ఆమె వరుస బ్లాక్‌బస్టర్లతో థియేటర్లను షేక్ చేయడానికి రెడీ అయిపోయింది.

Samyuktha Menon

Samyuktha Menon

ప్రస్తుతం సంయుక్త ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ ఏడాది చివర్లోనే ఆమె సినిమా రన్​ మొదలవుతుంది. డిసెంబర్ 5, 2025న ‘అఖండ 2’ రిలీజ్ కానుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఈ మాస్ యాక్షన్ ఎపిక్ కోసం బాలయ్య అభిమానులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంయుక్త ఇందులో లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక వచ్చే ఏడాది సంయుక్త వరుసగా రెండు సినిమాలతో డబుల్ డోస్ ఇవ్వనుంది. మొదటిది ‘స్వయంభు’ – నిఖిల్ సిద్ధార్థ్ సరసన సంయుక్త రొమాన్స్ ట్రాక్‌లో కనిపించబోతోంది.

ఫిబ్రవరి 13, 2026న వస్తున్న ఈ లవ్ స్టోరీలో సంయుక్త ఇప్పటివరకు టచ్​ చేయని జానర్లో కనిపించనుందని టాక్​. అంతేకాదు, చాలా కాలంగా వాయిదా పడిన ‘నారి నారి నడుమ మురారి’ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ కానుందట. అంతేకాదు, ఏప్రిల్ 2026లో సంయుక్త మొదటి హిందీ సినిమా కూడా రిలీజ్​ కానుందట. ఈ నాలుగు సినిమాల రిలీజ్​ తర్వాత సంయుక్త మరింత బిజీ అవుతుందని టాలీవుడ్​ టాక్​. అదెంతవరకు నిజమవుతుందో చూడాలి మరి!