AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puja Kannan: హీరోయిన్‌గా సాయి పల్లవి సోదరి.. ఫస్ట్‌లుక్ విడుదల.. రిలీజ్‌ ఎప్పుడంటే..

దక్షిణాది సినీ పరిశ్రమలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అంతకుమించిన అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుందీ..

Puja Kannan: హీరోయిన్‌గా సాయి పల్లవి సోదరి.. ఫస్ట్‌లుక్ విడుదల.. రిలీజ్‌ ఎప్పుడంటే..
Basha Shek
|

Updated on: Nov 22, 2021 | 3:24 PM

Share

దక్షిణాది సినీ పరిశ్రమలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అంతకుమించిన అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవల నాగచైతన్యతో కలిసి ‘లవ్‌స్టోరీ’తో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్‌ కూడా సాయిపల్లవి బాటలోనే నడుస్తుందంటూ, త్వరలోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని గతంలో పలు రూమర్లు, వార్తలు వచ్చాయి. తాజాగా అవి నిజమయ్యాయి. తెలుగు, తమిళ సినిమాల్లో ఫైట్‌మాస్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న స్టంట్ సిల్వ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి సినిమాలో పూజా హీరోయిన్‌గా ఎంపికైంది. ‘చిత్తారాయి సెవ్వనం’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.

గతంలో.. ఈ సినిమాలో ప్రముఖ నటుటు, దర్శకుడు సముద్రఖని కూడా నటిస్తున్నాడు. కొత్త పోస్టర్‌ చూస్తుంటే వీరిద్దరు తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌తో పాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా ఖరారుచేసింది చిత్రబృందం. డిసెంబర్ 3న ‘చిత్తారాయి సెవ్వనం’ సినిమా డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సోషల్‌ మీడియాలో సాయిపల్లవిని అనుసరించే వారికి పూజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చూడడానికి అక్కాచెల్లెలిద్దరూ ఓకేలా ఉంటారు. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్‌లోనూ చాలామంది పూజను చూసి సాయిపల్లవే అనుకున్నారు. ఇంతకు ముందు దర్శకుడు ఏఎల్ విజయ్ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్ గా పని చేసింది పూజ. ఆ తర్వాత ‘కార’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇదే అనుభవంతో ఏకంగా సినిమా ఛాన్స్‌ను దక్కించుకుంది.

Also Read:

Bigg Boss 5 Telugu: హౌస్‏లో నామినేషన్స్ హీట్.. ఆ ఇద్దరిపై విరుచుకుపడిన శ్రీరామచంద్ర..

Samantha: ఎట్టకేలకు రూమర్స్ పై స్పందించిన సమంత.. ఆ విషయాలపై నన్ను నేను ప్రశ్నించుకుంటా అంటూ..

Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో