MICHAEL Movie: సందీప్ కిషన్..విజయ్ సేతుపతి సినిమాలో విలన్‏గా ఆ స్టార్ డైరెక్టర్.. ప్రకటించిన మైఖేల్ టీం..

యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు స్పీడ్ మీదున్నాడు. ఇటీవల గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు

MICHAEL Movie: సందీప్ కిషన్..విజయ్ సేతుపతి సినిమాలో విలన్‏గా ఆ స్టార్ డైరెక్టర్.. ప్రకటించిన మైఖేల్ టీం..
Michel Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 22, 2021 | 1:53 PM

యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు స్పీడ్ మీదున్నాడు. ఇటీవల గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు సందీప్ కిషన్. తాజాగా ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మైఖేల్. భారీ యాక్షన్ ఎంటర్‍టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్ ఎల్ఎల్పి బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణంలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన టైటిల్ పోస్టర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇందులో విలన్ పాత్రలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటిస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా గౌతమ్ మీనస్ ఫేస్ రివీల్ చేయకుండా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. అందులో రక్తం కారుతున్న చేతికి బేడీలు వేసి ఉండటాన్ని చూడవచ్చు. గౌతమ్ మీనస్ ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ డైరెక్టర్‍గా కొనసాగుతున్నారు. ప్రేమకథలతోపాటు.. యాక్షన్ సినిమాలను రూపొందిస్తూ సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతున్నారు గౌతమ్ మీనన్. ఇక ఈ సినిమాలో భారీ స్థాయిలోనే నటీనటులు నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్న చిత్రయూనిట్.

Also Read: Bigg Boss 5 Telugu: హౌస్‏లో నామినేషన్స్ హీట్.. ఆ ఇద్దరిపై విరుచుకుపడిన శ్రీరామచంద్ర..

Viral Photo: చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పటికీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్!

Samantha: ఎట్టకేలకు రూమర్స్ పై స్పందించిన సమంత.. ఆ విషయాలపై నన్ను నేను ప్రశ్నించుకుంటా అంటూ..