AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పటికీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్!

సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగినప్పటి నుంచి సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కి మధ్య దూరం తగ్గిపోయింది. సినిమా అప్‌డేట్స్‌తో...

Viral Photo: చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పటికీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్!
Ravi Kiran
|

Updated on: Nov 22, 2021 | 1:02 PM

Share

సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగినప్పటి నుంచి సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కి మధ్య దూరం తగ్గిపోయింది. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ.. అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌ల ద్వారా అభిమానులతో హీరోలు, హీరోయిన్లు ముచ్చటిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ‘త్రోబ్యాక్’ ఫోటోస్ క్రేజ్ ఎక్కువైంది. ఏదైనా పండుగ వచ్చినా.. లేదా పుట్టినరోజు నాడు గానీ హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ నేపధ్యంలోనే తమ అభిమాన హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలను క్షణాల్లో ఫ్యాన్స్ వైరల్ చేస్తూ ఉంటారు. ఈ కోవలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు చక్కటి స్టైలిష్ ఫోజిచ్చిన ఈ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. సీనియర్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. తన అందం, అభినయంతో నేటికీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా వెలిగిపోతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రియా శరన్.

‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన శ్రియ.. ఆ తర్వాత సంతోషం, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, ఛత్రపతి, శివాజీ, డాన్ శీను.. లాంటి పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి సుమారు 75 చిత్రాల్లో నటించింది. కాగా, శ్రియ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘గమనం’, ‘నరగసూరన్’, ‘తడక’ చిత్రాల్లో నటిస్తోంది.

Follow Us
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?