పవన్-రానా సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన ఫిదా బ్యూటీ.. ఆలోచనలో పడ్డ నిర్మాతలు..!

వరుస సినిమాలతో బిజీగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను..

  • Rajeev Rayala
  • Publish Date - 7:15 pm, Thu, 24 December 20
పవన్-రానా సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన ఫిదా బ్యూటీ.. ఆలోచనలో పడ్డ నిర్మాతలు..!

వరుస సినిమాలతో బిజీగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్. ఈ సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో యంగ్ హీరో రానా పవన్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ ప్రాజెక్ట్ ఇటీవలే పూజ కార్యక్రమాలతో మొదలైంది. అలాగే సినిమాకోసం ఓ హీరోయిన్ గా ఫిదా బ్యూటీ సాయి పల్లవిని ఎంపిక చేసారని వార్తలు వస్తున్నాయి. ఇందులో రానా వైఫ్ క్యారెక్టర్ కు ఐశ్వర్య రాజేష్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ వైఫ్ గా సాయిపల్లవిని సంప్రదిస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో నటించడానికి సాయి పల్లవి రెండు కోట్లు డిమాండ్ చేసిందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. సాయిప‌ల్ల‌వి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తుండ‌టంతో మేక‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.