మెగా మేనల్లుడి కొత్త సినిమా ప్రారంభం.. మిస్టికల్ థ్రిల్లర్ కథతో రాబోతున్న సుప్రీం హీరో..
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నాడు. ఇటు డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నాడు. ఇటు డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలవుతుండగా.. గురువారం మరో సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు ఈ మెగా హీరో. పూర్తిగా మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా చిత్రానికి భమ్ బోలేనాథ్ సినిమా దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్నాడు.
కాగా గురువారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో #SDT 15 సినిమాను పూజా చేసి వైభవంగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ మూవీ హీరో సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టారు. అయితే సాయి ధరమ్ తేజ్ తన కెరీర్లోనే మొదటిసారిగా మిస్టికల్ థ్రిల్లర్ కథతో కూడిన సినిమాలో నటించబోతున్నాడట. ‘సిద్ధార్థ నామ సంవత్సరే.. బృహస్పతి.. సింహారాశౌ.. స్థిత సమయే.. అంతిమ పుష్కరే’ అని తెలుపుతూ సినిమా పోస్టర్లో సరికొత్త కథాంశంతో రాబోతున్న చిత్రం అని ముందుగానే హింట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ ఇంకా ప్రకటించలేదు.