AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాత్రూంలోనే నిండు గర్బిణి ప్రసవం..

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ పసి ప్రాణం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం జరిగింది.

వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాత్రూంలోనే నిండు గర్బిణి ప్రసవం..
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2020 | 6:39 PM

Share

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ పసి ప్రాణం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం జరిగింది. ఓ మహిళ ప్రసవం కోసం తాండూరు ఆసుపత్రి రాగా అక్కడ వైద్య సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోనే ప్రసవించింది. పుట్టగానే ఆ శిశువు మరణించింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మల్ రెడ్డి పల్లికి చెందిన నిండు గర్భిణీ మనీషా పురిటి నొప్పులతో ఉదయం 3 గంటల సమయంలో తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆ సమయానికి ఆమెకు చికిత్స చేయడానికి అక్కడ సిబ్బంది ఎవరు లేరు. దీంతో ఆ మహిళ ఆసుపత్రి ఆవరణలోగల బాత్రూంలో ప్రసవించింది. అయితే మనీషాకు పుట్టిన శిశువు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మనీషా కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీషా ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆసుపత్రిలో సిబ్బంది ఎవరు లేకపోవడం, సమాచారం ఇచ్చిన ఎవరు రాకపోవడంతో తమ బాబు చనిపోయాడంటూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కాగా మనీషాకు మొదట పాప జన్మించగా ఇప్పుడు బాబు పుట్టి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించడంతోనే తమ బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు హస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Follow Us
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?