స్టార్ట్.. కెమెరా.. యాక్షన్‌.. సెట్స్‌పైకి వెళ్లే మొదటి చిత్రం ఏదంటే..!

కరోనా నేపథ్యంలో దాదాపు నెలన్నర్ర రోజులుగా టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్‌లు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్‌లకు ఇప్పుడు తెలంగాణలో అనుమతి లభించడంతో

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్‌.. సెట్స్‌పైకి వెళ్లే మొదటి చిత్రం ఏదంటే..!

కరోనా నేపథ్యంలో దాదాపు నెలన్నర్ర రోజులుగా టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్‌లు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్‌లకు ఇప్పుడు తెలంగాణలో అనుమతి లభించడంతో, చిత్రీకరణ కోసం అందరూ సిద్ధమవుతున్నారు. జూన్ మొదటి వారం నుంచి సినిమాలు షూటింగ్‌ను జరుపుకోనున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మొదట సెట్స్ మీదికి వెళ్లే చిత్రం ఆర్ఆర్ఆర్‌నట. ఫిలింనగర్ వర్గాల ప్రకారం ఈ మూవీ షూటింగ్‌ను జరిపేందుకు రాజమౌళి సిద్దమయ్యారట.

అంతేకాదు షూటింగ్‌కు రెడీ అవ్వాల్సిందిగా టీమ్‌ మొత్తానికి రాజమౌళి ఇప్పటికే ఇన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా కరోనా నేపథ్యంలో హెల్త్ గైడ్‌లెన్స్‌ను పాటిస్తూ షూటింగ్ జరుపుకోవాలని సీఎం కేసీఆర్ సినిమా వారికి సూచించగా.. అందుకు తగ్గట్లుగా రాజమౌళి ప్రిపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఫిక్షన్‌ కథాంశంతో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’‌ను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్- రామ్ చరణ్‌లు కలిసి నటించే మొదటి చిత్రం ఇదే కాగా.. ఇందులో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా, చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా, అజయ్‌ దేవగన్, రాహుల్ రామకృష్ణ, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read This Story Also: ‘ఆన్‌లైన్’‌లో కీర్తి మరో చిత్రం..!

Click on your DTH Provider to Add TV9 Telugu