Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

‘ఆన్‌లైన్’‌లో కీర్తి మరో చిత్రం..!

కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడగా.. త్వరలోనే తిరిగి చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి.
Keerthy Suresh next movie, ‘ఆన్‌లైన్’‌లో కీర్తి మరో చిత్రం..!

కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడగా.. త్వరలోనే తిరిగి చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చేసింది. జూన్ నుంచి షూటింగ్‌లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా దేశవ్యాప్తంగా త్వరలోనే షూటింగ్‌లకు అనుమతులు ఇస్తామని అన్నారు.

అయితే షూటింగ్‌లకు పర్మిషన్‌ లభించినప్పటికీ.. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఆగష్టులో తెరిచే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తున్నప్పటికీ.. ప్రభుత్వాలు మాత్రం మరికొన్ని రోజులు థియేటర్లు ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చాలా సినిమాలు ఆన్‌లైన్ బాట పడ్డాయి. అన్ని భాషల్లోనూ చాలా చిత్రాలు ఇప్పుడు డైరెక్ట్‌గా రిలీజ్ అవ్వబోతున్నాయి. వాటికి సంబంధించిన డేట్లు కూడా వచ్చేశాయి. అందులో కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రం కూడా ఉంది. తెలుగు, తమిళ్‌లో ఈ చిత్రం జూన్‌ 19న విడుదల కాబోతోంది.

కాగా తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ నటించిన మరో చిత్రం కూడా ఆన్‌లైన్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో కీర్తి నటించిన ‘మిస్ ఇండియా’ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్లు ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నదియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్‌ కోనేరు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందించారు.

Read This Story Also: ‘అత్యాచారం’పై హైకోర్టు సంచలన తీర్పు..!

Related Tags