AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్ఆర్ఆర్’లో మూడు పాత్రల్లో చెర్రీ..!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్‌ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని వచ్చే

'ఆర్ఆర్ఆర్'లో మూడు పాత్రల్లో చెర్రీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2020 | 6:36 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్‌ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఇందులో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నాడని దర్శకుడు ఎప్పుడో అధికారికంగా ప్రకటించేశారు. ఇక రామ్ చరణ్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా ఇటీవల విడుదల కాగా.. మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం మూడు పాత్రల్లో చెర్రీ కనిపించనున్నాడట.

ఇటీవల వచ్చిన మోషన్ పోస్టర్‌ను గమనిస్తే చెర్రీ సీతారామరాజు గెటప్‌లో కనిపించలేదు. ఖాకీ డ్రస్‌లో కనిపించారు. అలాగే అందులో హెయిర్ స్టైల్ బట్టి చూస్తే.. ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్లుగా ఉంది. ఇక మోషన్ పోస్టర్ ఎండింగ్‌లో అల్లూరి సీతారామ రాజు పాత్రను షాడోలో చూపించారు. ఈ నేపథ్యంలో చెర్రీ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడన్న వార్త ఒకటి టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అల్లూరిగా, పోలీస్‌గా అలాగే మరో పాత్రలో చెర్రీ నటిస్తున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి బ్లాక్‌బస్టర్‌ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: ఆ మల్టీస్టారర్‌ కోసం మొదట పవన్, మహేష్‌ను అనుకున్నారట..!

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!