AA20 : ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్..చింపేశారంతే..

ఈ చిత్ర‌ రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా, క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో విధించిన‌ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే సినిమాకు సంబంధించిన‌ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

AA20 : ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్..చింపేశారంతే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 8:36 PM

‘అల వైకుంఠపురంలో’మూవీతో చాలాకాలం త‌ర్వాత సాలిడ్ హిట్ త‌న ఖాతాలో వేస‌కున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కాగా బ‌న్నీ త‌న‌ తర్వాతి మూవీ సుకుమార్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు వ‌చ్చి మంచి విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు మూడో మూవీ రాబోతుండ‌టంతో భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి.

ఈ చిత్ర‌ రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా, క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో విధించిన‌ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే సినిమాకు సంబంధించిన‌ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ జట్టు వెన‌క్కి దువ్వి, గుబురు గబ్బంతో ఎప్పుడూ లేనంత మాస్ లుక్‌లో దుమ్ము రేపుతున్నాడు. సినిమాలో అల్లు అర్జున్… లారీ డ్రైవర్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తోన్న నేప‌థ్యంలో..లుక్ ఆ మాదిరిగానే డిజైన్ చేశారు. కోపంగా చూస్తున్న హీరో వెనక‌ గంధపు చెక్కలు క‌నిపిస్తున్నాయి.

దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తుండ‌గా… ‘రంగస్థలం’ ఫార్మాట్ లోనే ప‌క్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్క‌బోతుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్ చూస్తుంటే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంది. ఇదే అఫిషియల్ పోస్టర్‌ ఏమో అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.