అక్షయ్‌ని పొగుడుతూ..ఆ “ముగ్గురు ఖాన్స్”పై దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా..!

సోషల్ మీడియా.. హద్దులంటూ లేనిది ఇది.. ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛనైనా ఇందులో చెప్పుకుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రంపంచ దేశాలన్నింట కలిపి.. మొత్తం 33వేల మందిని బలిగొంది. మరో ఏడు లక్షల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ మహమ్మారిపై పోరాడేందుకు అన్ని దేశాలు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మనదేశంలో కూడా ఈ మహమ్మారిని తరమేసేందుకు కేంద్ర ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. […]

అక్షయ్‌ని పొగుడుతూ..ఆ ముగ్గురు ఖాన్స్పై దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా..!
Follow us

| Edited By:

Updated on: Mar 30, 2020 | 9:30 PM

సోషల్ మీడియా.. హద్దులంటూ లేనిది ఇది.. ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛనైనా ఇందులో చెప్పుకుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రంపంచ దేశాలన్నింట కలిపి.. మొత్తం 33వేల మందిని బలిగొంది. మరో ఏడు లక్షల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ మహమ్మారిపై పోరాడేందుకు అన్ని దేశాలు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మనదేశంలో కూడా ఈ మహమ్మారిని తరమేసేందుకు కేంద్ర ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా.. దాదాపు అన్ని రంగాల వారు వారి వారి శక్తి కొలది విరాళాలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కార్పోరేట్ కంపెనీలతో మొదలు పెడితే.. టాటా, రిలయన్స్, ఆదానీ, ఇన్ఫోసిస్ ఇలా అన్ని కంపెనీలు ప్రభుత్వానికి తమ వంతు సాయంగా కోట్ల రూపాయలను విరాళాలుగా ఇచ్చాయి. క్రీడా కారులు కూడా వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ఇక ప్రముఖంగా బాలీవుడ్, టాలీవుడ్ సినిమా రంగాల వారు కూడా వారి వారి స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ టాప్‌ హీరోస్‌ గురించి సోషల్ మీడియాలో పెద్ద హాట్‌ టాపిక్‌ చర్చ కొనసాగుతోంది.

గత రెండు మూడు రోజుల క్రితం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. కేంద్ర ప్రభుత్వానికి కరోనా నియంత్రణ సహాయం కింద.. ఏకంగా రూ.25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి.. రియల్ హీరో అనిపించుకున్నారు. ఇక మన తెలుగు హీరోలు కూడా భారీగా విరాళాలు ఇచ్చారు. అటు కేంద్రానికి, ఇటు తెలుగు రాష్ట్రాలకు వారి వారి స్థాయికి తగ్గట్లుగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబు, నితిన్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా దాదాపు అంతా విరాళాలిచ్చారు.

ఇదంతా బాగానే ఉంది సరే. అసలు సోషల్ మీడియా చెప్తున్న విషయం ఏంటంటే.. దేశంలో టాప్ హీరోలుగా అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంతవరకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదని. అంతే కాదు.. ఈ ముగ్గురు ఖాన్‌లపై విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. వీరు ఈ దేశ ప్రజల దగ్గరి నుంచి డబ్బులు సంపాదించి.. కనీసం కృతజ్ఙత లేకుండా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. మెజార్టీ ప్రజలు ఆదరించడం వల్లే.. వారు ఈ స్థాయికి ఎదిగారని.. కానీ వారు ప్రస్తుతం దేశానికి ఎలాంటి సహాయం చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల సహాయాం చేశారని.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ముగ్గురు ఏం సహాయం చేశారని ప్రశ్నిస్తున్నారు. వారి అధికారిక ట్విట్టర్‌లకు డైరక్ట్‌గా ట్యాగ్‌ చేస్తూ.. ట్రోల్‌కు దిగుతున్నారు. ఇక నుంచి వీరి సినిమాలు బాయ్ కాట్ చేయాలంటూ మరికొందరు పిలుపునిస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఇంతలా ట్రోల్ జరుగుతున్నా..ఇందులో సల్మాన్ ఖాన్ మాత్రం.. సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.సినీ పరిశ్రమలో పనిచేసే చిన్నాచిత‌కా ఆర్టిస్టుల‌కు హెల్పింగ్ హ్యాండ్ అందిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో..చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే క‌ళాకారుల ప‌రిస్థితి కూడా ద‌య‌నీయంగా మారిందని.. వారికి స‌హాయం చేసేందుకు సినీ ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని ఎఫ్‌డ‌బ్ల్యూఐసిఈ అధికార ప్ర‌తినిధి బీఎన్ తివారీ కోరాడు.

దీంతో తాప్సీ ప‌న్ను, క‌ర‌ణ్ జోహార్ వంటి ప్ర‌ముఖులు ముందుకు వచ్చారు. అయితే.. వీరందరికంటే ఓ అడుగు ముందుకేసిన.. సల్మాన్ ఖాన్ భారీ ప్రకటన చేశారు. ఏకంగా 25 వేల మందికి ఆర్థిక సహాయం చేయడానికి రెడీ అయ్యారు. త‌న‌ బీయింగ్ హ్యూమ‌న్‌ ఫౌండేష‌న్ ద్వారా.. రోజు వారీగా ప‌నిచేసే క‌ళాకారుల‌కు ఆర్థిక స‌హాయం అందించాల‌ని సల్మాన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారని.. బీఎన్ తివారీ తెలిపారు. ఇక మిగతా ఇద్దరు ఖాన్‌లు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారి అభిమానులు చెబుతున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..