AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rang De PreRelease Event : ఈ సినిమా వల్ల మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము..

తొలి ప్రేమ' ఫేమ్‌ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం రంగ్‌దే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

Rang De PreRelease Event : ఈ సినిమా వల్ల మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము..
Venky Atluri
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2021 | 2:51 PM

Share

Rang De : తొలి ప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం రంగ్‌దే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ మాట్లాడుతూ.. ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాలకు నేను సంగీతం అందించాలి. మ్యూజిక్‌ టూర్స్‌లో ఉండడం వల్ల డేట్స్‌ కుదరలేదు. ఈ సినిమా గురించి ఫ్లైట్‌లో కలిసినప్పుడు ఓ గంట కథ చెప్పారు. అలా ‘రంగ్‌ దే’ కుదిరింది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్ స్టోరీ ఇది. నితిన్‌ చేసిన సినిమాల్లో డిఫరెంట్‌ సినిమా ఇది’’ అని అన్నారు.

అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘నితిన్‌, కీర్తి ఈ కథ అంగీకరిస్తారని అనుకోలేదు. అర్జున్‌, అను పాత్రలకు ప్రాణం పోశారు. మేం ముగ్గురం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. లాక్‌డౌన్‌లో నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్‌ మరచిపోలేనిది. దేవిగారిని ఓ ఫ్యాన్‌గా కలిశా. ఆయన మాత్రం నాకు ఫ్రీడమ్‌ ఇచ్చి కావలసినట్లు సంగీతం ఇచ్చారు. పీసీ శ్రీరామ్‌గారు సినిమా అంగీకరించడం నా అదృష్టం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ద బెస్ట్‌ ఇచ్చారు. వెన్నెల కిషోర్‌, అభినవ్‌ కామెడీ చక్కగా పండుతుంది. సినిమా చూసి త్రివిక్రమ్‌గారు ఇచ్చిన సపోర్ట్‌ మరువలేను’’ అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rang De : ఆ ఇద్దరు నా వెనకున్న అదే నా దైర్యం నా దమ్ము.. రంగ్ దే ప్రీరిలీజ్ ఈవెంట్ లో నితిన్

Follow Us
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..