AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rang De : ఆ ఇద్దరు నా వెనకున్న అదే నా ధైర్యం అదే నా దమ్ము.. రంగ్ దే ప్రీరిలీజ్ ఈవెంట్ లో నితిన్

యూత్ స్టార్ నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

Rang De : ఆ ఇద్దరు నా వెనకున్న అదే నా ధైర్యం అదే నా దమ్ము.. రంగ్ దే ప్రీరిలీజ్ ఈవెంట్ లో నితిన్
Nithin
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2021 | 2:46 PM

Share

Rang De : యూత్ స్టార్ నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్‌ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నా వయసు 24 ఏళ్లు. నిజంగా నా వయసు 36 ఏళ్లు. దర్శకుడు కథ చెప్పినప్పుడు నా వయసుని జనాలు అంగీకరిస్తారా అన్న అనుమానం వచ్చింది. పీసీ శ్రీరామ్‌ డిఓపీ అనగానే ఆయన బాగా చూపిస్తారనే నమ్మకంతో ధైర్యం వచ్చింది. ‘ఇష్క్‌’ తర్వాత ఆయనతో మరోసారి పని చేయడం హ్యాపీగా ఉంది. డీఎస్‌పీ డైమండ్స్‌ లాంటి పాటలిచ్చారు. కీర్తి సురేశ్‌ అనగానే ‘మహానటి’ గుర్తొస్తుంది. ఈ సినిమాలో మాత్రం ఆమె మహా నాటు, మహా నాటీ. ఈ కథకు ఆమె పెద్ద ఎసెట్‌. దర్శకుడితో పన్నెండేళ్ల పరిచయం ఉన్నా మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఇప్పటికి కుదిరింది. చాలా సెన్సిబుల్‌గా ఈ కథను తెరకెక్కించాడు. ఈ బ్యానర్‌లో మూడో సినిమా ఇది. నేను ఫ్లాప్‌లో ఉన్న ప్రతిసారీ ఈ బ్యానర్‌ హిట్‌ ఇస్తుంది. సెంటిమెంట్‌గా చూస్తే ఈ సినిమా కూడా హిట్‌ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో నా రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవన్‌కల్యాణ్‌గారు, రెండు త్రివిక్రమ్‌గారు. ఈ ఇద్దరూ నా వెనకున్నారు. అదే నా ధైర్యం అదే నా దమ్ము’’ అని చెప్పుకొచ్చాడు నితిన్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Suhasini Maniratnam : కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న అలనాటి అందాల తార సుహాసిని

నవీన్‌ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.