Karthika Deepam: కార్తీకదీపం సీరియల్‌కు ఆయువుపట్టు మోనిత.. ఈ సీరియల్‌కు గుడ్‌బై చెప్పేసిందా.. !
Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై సంచలనం సృష్టిస్తూ.. మూడేళ్లకు పైగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్.. ఈ సీరియల్ కు కేవలం మహిళలే కాదు.. పురుషులు కూడా అభిమానులే.. అత్యంత ఆదరణ పొందిన..
Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై సంచలనం సృష్టిస్తూ.. మూడేళ్లకు పైగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్.. ఈ సీరియల్ కు కేవలం మహిళలే కాదు.. పురుషులు కూడా అభిమానులే.. అత్యంత ఆదరణ పొందిన ఈ సీరియల్ లో ప్రతి పాత్ర ఆదరణ సొంతం చేసుకుంది. దీప వంటలక్క క్యారెక్టర్ కి అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఇక డాక్టర్ బాబు, సౌందర్య, ఆనందరావు, అర్ధపావు భాగ్యం, ఆదిత్య, విలన్ మోనిత నుంచి పనిమనిషి ప్రియమణి వరకూ ఫేమస్ పాత్రలే.. ఆయా క్యారెక్టర్లలో సదరు నటీనటులు ఓడిపోయి నటిస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నవారే.. 16 ఏళ్ల ప్రేమ అంటూ మోనిత క్యారెక్టర్ లో నటిస్తున్న శోభా శెట్టి.. విలనిజం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాను ప్రేమించిన కార్తీక్ ని దక్కించుకోవడం కోసం.. ఎంతటికైనా తెగించే పాత్రలో నటిస్తూ జీవిస్తున్న శోభా శెట్టి.. కార్తీక దీపం సీరియల్ కు గుడ్ బై చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.
మోనిత గురించి కార్తీక్ కు పూర్తిగా తెలిసింది. మోనిత ప్రేమ పేరుతో చేసిన ఘోరాలు.. నేరాలు తెలుసుకున్న కార్తీక్.. చంపేసినట్లు చూపించారు. దీంతో మోనిత పాత్రను ఈ సీరియల్ నుంచి కొన్నాళ్ళు తప్పించారా.. లేక నిజంగా చంపేసి.. ఆ క్యారెక్టర్ కు గుడ్ బై చెప్పేశారా అనే అనుమానాలు సీరియల్ ఫ్యాన్స్ లో కనిపిస్తున్నాయి. అయితే శోభా శెట్టి.. కన్నడలో ఫేమస్ యాక్టర్.. దీంతో ఆమెకు అక్కడ నాలుగైదు సీరియల్స్ లో నటిస్తూ.. ఫుల్ బిజినట.. ముఖ్యంగా తెలుగులో ప్రసారమవుతున్న దేవత సీరియల్ కన్నడ భాషలో రుక్కు పాత్రలో (శోభా శెట్టి) మోనిత నటిస్తుంది. దీంతో కన్నడ, తెలుగు లో కాల్ షీట్స్ ను కేటాయించలేకపోతుంది.. అందువల్లనే కార్తీకదీపం సీరియల్ నుంచి రెండు నెలలు పాటు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్యారెక్టర్ లేకుండా కార్తీక దీపం ని నడిపిస్తారని.. మోనిత నిజంగా చచ్చిపోయిందా.. లేక యధావిధిగా నాటకం మొదలు పెట్టిందా అనే కోణంలో సీరియల్ సాగనున్నదని తెలుస్తోంది. అయితే రెండు నెలల అనంతరం మోనిత క్యారెక్టర్ లో శోభా శెట్టి తిరిగి వస్తుందా.. లేక మొత్తని కి గుడ్ బై చెప్పేస్తే.. ఆ పాత్రలో మరొక నటి వస్తుందా అని తెలియాల్సి ఉంది.
Also Read: Types Of Walking: ప్రశాంతమైన మూడ్‌లో చేస్తే మంచి ఫలితాలు ఇచ్చే వాకింగ్ ఎన్ని రకాలో తెలుసా..