Types Of Walking: ప్రశాంతమైన మూడ్‌లో చేస్తే మంచి ఫలితాలు ఇచ్చే వాకింగ్ ఎన్ని రకాలో తెలుసా..
Types Of Walking:ప్రపంచ వ్యక్తంగా మనిషి జీవిత విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో జీవన శైలి, అలవాట్లతో అనేక రోగాలబారినపడుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు..
Types Of Walking:ప్రపంచ వ్యక్తంగా మనిషి జీవిత విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో జీవన శైలి, అలవాట్లతో అనేక రోగాలబారినపడుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, “జీవన శైలి”ని సరిదిద్దే పనిలో పడ్డారు. అందుకనే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు తినకూడదని చెప్పిన అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. అదే సమయంలో తగినంత శారీరక శ్రమ చేయాలని సూచిస్తున్నారు.
అయితే వాకింగ్ చేసే వారు ముందుగా ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు. ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు “వాకింగ్” ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు “బ్రిస్క్‌వాక్” చేయాలనుకుంటే, ఇంకొందరు “స్టెయిర్ కేస్ వాక్” చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. సరదాగా మనం చేసే వాకింగ్ ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు..
చురుకైన నడక:
సాధారణంగా నడిచినట్లే నడుస్తారు కానీ కొంచెం వేగంగా… అంటే గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడుస్తారు. ఈ రకమైన నడకను అప్పుడే వాకింగ్ మొదలు పెట్టేవారికి అనువైంది.
పవర్ వాకింగ్:
చురుకైన వాకర్ల అంటే ఎక్కువ ఫిట్‌నెస్ ఉన్న వ్యక్తులు చేస్తారు. దీనిలోని వేగం గంటకు ఏడు నుండి తొమ్మిది కిలోమీటర్లు ఉండాలి.
రేస్ వాకింగ్:
రేస్ వాకింగ్ అనేది చాలా కఠినమైన క్రీడ. శరీరంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఫిట్నెస్ స్థాయిమంచిగా ఉండాలి. అయితే ఈ రేస్ వాకింగ్ అనేది నవ్వించే ఒలింపిక్ క్రీడ, కానీ చూడటానికి ఇష్టపడతారు.
మారథాన్ వాకింగ్:
ఇది రోజురోజుకు మరింత ప్రజాదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మారథాన్లు వాకర్స్ కోసం తెరవబడుతున్నాయి. కొన్ని మారథాన్‌లు ప్రత్యేకంగా నడిచేవారికి కోసం ఏర్పడ్డాయి.
చి వాకింగ్:
చి అనేది చైనీస్ పదం. ప్రాణశక్తిని ఇస్తుంది. చి వాకింగ్ చైనీస్ ఆర్ట్ తాయ్ చి సూత్రాలను ఉపయోగిస్తూ.. వాకింగ్ చేస్తారు.
పోల్ వాకింగ్ లేదా నార్డిక్ వాకింగ్:
ఇది మొదట్లో స్కీయర్లకు ఆఫ్ సీజన్ శిక్షణగా అభివృద్ధి చేయబడింది. నార్డిక్ వాకింగ్ లేదా పోల్ వాకింగ్ మనిషి నడక జీవనశైలితో పాటు.. శారీరక ఫిట్ నెస్ అభివృద్ధికి సహాయపడుతుంది.
ఏది ఏమైనా మనిషి బద్ధకాన్ని వదిలి.. సంతోషంగా వాకింగ్ చేస్తూ.. ఆరోగ్యంగా జీవించాలి
Also Read: గ్రామస్థుల కోసం.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 108 కేజీల కారంతో స్నానం చేసిన పూజారి ఎక్కడంటే..