Ravi Teja Khiladi : జోరు పెంచిన మాస్ మహారాజ్.. ‘ఖిలాడి’మూవీ టీజర్ కు డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ .?
మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో...

Ravi Teja Khiladi : మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇదే జోష్ లో తన తదుపరి సినిమాను కూడా మొదలు పెట్టేసాడు రవి తేజ.
ఈ సినిమాకు ‘ఖిలాడి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు రవితేజ. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఖిలాడి టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ ఫిక్సయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ . కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
Esha Chawla : మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగుమ్మ..రెండు సినిమాలతో రానున్న ఇషాచావ్లా…