Esha Chawla : మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగుమ్మ..రెండు సినిమాలతో రానున్న ఇషాచావ్లా…
‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆతర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె..

Esha Chawla : ‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆతర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. సునీల్ సరసన ‘పూలరంగడు’,మిస్టర్ పెళ్ళికొడుకు’ అనే రెండు చిత్రాలలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ భామ ఎక్కడా కనిపించలేదు. తెలుగు సినిమాలు కూడా చేయడం లేదు.అయితే తాజాగా ఆమె మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది, తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోలు, సంక్రాంతి శుభాకాంక్షలతో వీడియో బైట్ ప్రెస్‌కు రిలీజ్ చేసింది. ఈ సందర్బంగా ఇషా చావ్లా మాట్లాడుతూ … తెలుగు ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరి బాగుండాలి నాకైతే పోజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి , త్వరలో తెలుగు లో ఒక ప్రముఖ ఛానల్ షో ద్వారా మీ ముందకు రాబోతున్నాను , తెలుగులో రెండు సినిమాలు కమిట్ అయ్యాను వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను అని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Pawan kalyan new look : పంచకట్టులో పవర్ స్టార్ పవన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు