Rashmika: సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న రష్మిక.. వారందరినీ వెనక్కినెట్టి మరీ..
అనతి కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకున్న అతికొద్ది మంది నటీమణుల్లో రష్మిక మందన ఒకరు. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో 2016లో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. గీతా గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది తెలుగులో అగ్ర హీరోయిన్‌గా..

అనతి కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకున్న అతికొద్ది మంది నటీమణుల్లో రష్మిక మందన ఒకరు. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో 2016లో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. గీతా గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది తెలుగులో అగ్ర హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వరుస విజయాలను అందుకున్న రష్మిక కెరీర్ పుష్పతో ఒక్కసారిగా మలుపు తిరిగింది.
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీలో శ్రీవల్లి అనే డీ గ్లామర్ పాత్రలో నటించిన రష్మిక ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది. బీటౌన్‌లో రష్మిక పేరు మాగుమోగింది. దీంతో హిందీలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. తాజాగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఐఎండీబీలో ఈ వారం కొత్తగా చేరిన సెలబ్రిటీల జాబితాలో టాప్-3లో నిలిచింది.




With fans celebrating her birthday last week and the release of the teaser of #Pushpa2, @iamRashmika makes her debut at #3 on IMDb’s Popular Indian Celebrities Feature! ? pic.twitter.com/1iASiVlo6V
— IMDb India (@IMDb_in) April 14, 2023
ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఐఎండీబీ తన ట్విటర్ వేదికగా ర్యాంకులను విడుదల చేసింది. ఈ జాబితాలో రష్మిక టాప్3లోకి రావడం విశేషం. ఇక ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో అల్లు అర్జున్ 17వ స్థానంలో ఉండగా, సీతారామం బ్యూటీ మృణాల్ 31వ స్థానం, తమన్నా33వ స్థానం, నాని 49వ స్థానం, కీర్తి సురేశ్ 50వ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో పాటు మరికొన్ని పాన్ ఇండియా మూవీస్‌లో నటిస్తోంది.
With his birthday last week and the anticipation building for the release of #Pushpa2 , @alluarjun in on everyone’s minds right now as he debuts on the IMDb Popular Indian Celebrities Feature at #17! ? pic.twitter.com/ci45NoJzNk
— IMDb India (@IMDb_in) April 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
