Rajendra Prasad: నాకు నా కూతురికి మధ్య మాటలు లేవు.. అసలు ఏం జరిగిందో చెప్పిన నటకిరీటి.. వైరల్ అవుతోన్న వీడియో
తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు రాజేంద్రప్రసాద్. అంతే కాదు పాత్ర ఏదైనా అందులోకి పరకాయప్రవేశం చేసి ఆ సినిమాకు ప్రాణం పోశారు రాకేంద్రప్రసాద్.
సీనియర్ హీరోల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్రప్రసాద్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు రాజేంద్రప్రసాద్. అంతే కాదు పాత్ర ఏదైనా అందులోకి పరకాయప్రవేశం చేసి ఆ సినిమాకు ప్రాణం పోశారు రాకేంద్రప్రసాద్. అందుకే ఆయనను నటకిరీటి అంటూ కీర్తించారు ఆడియన్స్. ఇప్పటికీ సినిమా కళామ్మతల్లికి సేవలందిస్తూ.. ప్రేక్షకుల మన్నలను అందుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీదే చెప్పేయడం ఆయన నైజం.. సినిమా ఫంక్షన్స్ లో ఆయన స్పీచ్ వింటే చెప్పేయవచ్చు ఆయన ఎంత ఖచ్చితమైన మనిషి అనేది.
ఇక రాజేంద్ర ప్రసాద్ పరసనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవ్వరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్రప్రసాద్. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురి గురించి మాట్లాడారు.
గతంలో బేవార్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఆ సినిమాలో శుద్దాల అశోక్ తేజ అమ్మ పై ఒక పాట రాశారు. దాని గురించి వివరిస్తూ.. అమ్మ లేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడు.. నా పదేళ్ల వయసలు మా అమ్మ గారు చనిపోయారు. నేను కూడా ఆ కూతురిలో అమ్మను చేసుకున్నా.. కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు.. ఆమె ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగుసార్లు వినిపించాయి అని అన్నారు రాజేంద్రప్రసాద్. ఇప్పుడు ఈ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.