AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఏమోషన్‌ కోణాన్ని తెలిపేలా కొత్త సాంగ్‌..

RRR Movie: యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. బాహుబలితో ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచేసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడం, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌...

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఏమోషన్‌ కోణాన్ని తెలిపేలా కొత్త సాంగ్‌..
Rrr Movie Update
Narender Vaitla
|

Updated on: Nov 22, 2021 | 7:02 PM

Share

RRR Movie: యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. బాహుబలితో ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచేసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడం, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. రాజమౌళి కూడా ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా, చిత్రీకరణ ఆలస్యం కావడం లాంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. చాలా రోజుల పాటు అప్‌డేట్‌లు లేక నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు జక్కన్న వరుస సర్‌ప్రైజ్‌లను అందిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్‌, చెర్రీల ఫస్ట్‌లుక్‌లతో మొదలైన ఈ సర్‌ప్రైజ్‌లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన నాటు నాటు, దోస్తీ పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా మూడో పాటను విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. నవంబర్‌ 26న ‘జనని’ అనే పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ విషయమై రాజమౌళి పోస్ట్‌ చేస్తూ.. ‘పెద్దన్న అద్భుతంగా కంపోజ్‌ చేసిన జనని పాట.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎమోషన్‌కు అద్దం పడుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సోల్‌ ఆంథమ్‌ నవంబర్‌ 26న విడుదల కానుంది. ఎమోషనల్‌ అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. మరి ఈ పాట ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

View this post on Instagram

A post shared by SS Rajamouli (@ssrajamouli)

Also Read: IBPS SO Recruitment 2021: నిరుద్యోగులకు గమనిక.. 1828 బ్యాంకు పోస్ట్‌లకు రేపే చివరితేదీ..

Delhi Pollution: హస్తినలో కాలుష్యానికి కారణం ఎవరూ? పొల్యూషన్‌కి సొల్యూషన్‌ ఉందా? ‘నాసా’ చెప్పిన అసలు నిజం!

Maggi with Fanta: ఇదేమి వంటరా నాయనా.. ఫాంటా డ్రింక్ మిక్స్‌తో మ్యాగ్గీ డిష్.. వైరల్ వీడియో

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..