Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: త్వరలో దేశవ్యాప్తంగా ‘సల్మాన్ టాకీస్’.. స్పష్టం చేసిన కండల వీరుడు..

Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం 'యాంటీమ్' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన బావ ఆయుష్ శర్మతో కలిసి వెండితెరపై కనిపిస్తారు.

Salman Khan: త్వరలో దేశవ్యాప్తంగా 'సల్మాన్ టాకీస్'.. స్పష్టం చేసిన కండల వీరుడు..
Salman Khan
Follow us
uppula Raju

|

Updated on: Nov 22, 2021 | 6:26 PM

Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం ‘యాంటీమ్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన బావ ఆయుష్ శర్మతో కలిసి వెండితెరపై కనిపిస్తారు. నటుడిగా, నిర్మాతగా పనిచేయడమే కాకుండా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ ‘సల్మాన్ టాకీస్’ ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ “నా అభిమానుల కోసం వీలైనంత త్వరగా ‘సల్మాన్ టాకీస్’ ఓపెన్‌ చేయాలనుకుంటున్నాను. అది త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నా. కరోనా కారణంగా పనులు నిలిపివేసినప్పటికీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ పనులు జరుగుతున్నాయి. కచ్చితంగా ఏదో ఒక రోజు ఇది ఓపెన్‌ అవుతుంది” అని చెప్పారు.

పెద్ద నగరాల్లో సల్మాన్ థియేటర్స్ ఓపెన్ చేస్తాడని భావించే వారికి కాస్త నిరాశే మిగిలింది. థియేటర్లు లేని గ్రామీణ, చిన్న పట్టణాల్లో సల్మాన్ థియేటర్స్ ఓపెన్ చేయబోతున్నారు. ముంబై లాంటి నగరాల్లో కాకుండా థియేటర్లు లేని చిన్న నగరాల్లో థియేటర్లు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సల్మాన్‌ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం సల్మాన్ చాలా మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను కలిసారు. మంచి మార్కెట్ ఇస్తుందని తన ప్రణాళికను వివరించారు. అన్నింటిలో మొదటిది ఈ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో ప్రారంభిస్తున్నారు. క్రమంగా ఇతర నగరాలకు విస్తరిస్తారు. ముంబై మిర్రర్ 2018లో నివేదించిన ప్రకారం.. సల్మాన్ ఖాన్ థియేటర్ చైన్‌ను తెరవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ టిక్కెట్లపై పన్ను రహితం లేదా సబ్సిడీ ఉంటుంది. అదే సమయంలో ఇది పిల్లలకు, నిరుపేదలకు ఉచితం. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం దశలోనే ఉంది.

రోహిత్‌ శర్మ పని పూర్తయింది.. కానీ విరాట్‌ కోహ్లీ, రహానే పని మిగిలే ఉంది.. ఏంటో తెలుసా..?

ఇల్లు కొనడానికి బంపర్‌ ఆఫర్.. ఈ-వేలంలో పాల్గొనండి.. తక్కువ ధరకే కొనుగోలు చేయండి..

PF Clients: పీఎఫ్‌ ఖాతాదారులకు గమనిక..! ఇప్పుడు ఉద్యోగం మానేస్తే ఈ పని చాలా సులభం..