Jersey: ఈ చిత్రం నాకెంతో స్పెషల్‌.. హిందీ జెర్సీ రిలీజ్‌ డేట్‌ వెల్లడించిన షాహిద్‌ కపూర్‌

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం 'జెర్సీ'. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్డ్స్‌ డ్రామా

Jersey: ఈ చిత్రం నాకెంతో స్పెషల్‌..  హిందీ జెర్సీ రిలీజ్‌ డేట్‌ వెల్లడించిన షాహిద్‌ కపూర్‌
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2021 | 4:34 PM

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘జెర్సీ’. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్డ్స్‌ డ్రామా సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడీ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు ‘జెర్సీ’ సినిమాను తెరకెక్కించిన గౌతమే బాలీవుడ్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి’ రీమెక్‌ ‘కబీర్‌ సింగ్‌’ తో ఆకట్టుకున్న షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. మృనాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లుఎంటర్ టైన్ మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. షూటింగ్‌ పూర్తి చేసుకున్నప్పటికీ కరోనా ఆంక్షల నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 31న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

కాగా ఈ సినిమా ట్రైలర్‌ రేపు (నవంబర్‌23)న విడుదల కానుంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టర్ ను పంచుకున్నాడు హీరో షాహిద్‌ కపూర్. ‘సమయం ఆసన్నమైంది. మేం ఈ సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఈ కథ, టీం, నా పాత్ర అన్నీ నాకెంతో ప్రత్యేకం. అదేవిధంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడం కూడా మాకెంతో స్పెషల్‌. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మాటలు రావడం లేదు’ అంటూ తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు షాహిద్‌.

Also Read:

Rana Daggubati: ‘నాకు అన్నీ నువ్వే’ అంటూ పెళ్లి వీడియో పంచుకున్న మిహీకా.. నెట్టింట్లో వైరల్‌..

Kamal Haasan: కరోనా బారిన పడ్డ కమల్‌ హాసన్‌.. అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్‌..

Rakul Preet Singh: జాకీతో నా పెళ్లి అప్పుడే.. మ్యారేజ్‌ ప్లాన్స్‌ను బయటపెట్టిన రకుల్‌..