AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: ‘నాకు అన్నీ నువ్వే’ అంటూ పెళ్లి వీడియో పంచుకున్న మిహీకా.. నెట్టింట్లో వైరల్‌..

బ్యాచిలర్‌ లైఫ్‌కు వీడ్కోలు పలుకుతూ మిహికాతో కలిసి గతేడాది ఆగస్టులో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు రానా దగ్గుబాటి. కరోనా ఆంక్షల నేపథ్యంలో కుటుంబీకులు...

Rana Daggubati:  'నాకు అన్నీ నువ్వే'  అంటూ పెళ్లి వీడియో పంచుకున్న మిహీకా.. నెట్టింట్లో వైరల్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2021 | 4:00 PM

బ్యాచిలర్‌ లైఫ్‌కు వీడ్కోలు పలుకుతూ మిహికాతో కలిసి గతేడాది ఆగస్టులో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు రానా దగ్గుబాటి. కరోనా ఆంక్షల నేపథ్యంలో కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుకగా వీరి వివాహం జరిగింది. పెళ్లికి రాలేనివారి కోసం శుభలేఖతో పాటు వర్చువల్‌ రియాల్టీలో వివాహ వేడుకను చూసేందుకు ప్రత్యేకంగా ఓ కిట్‌ను కూడా పంపించారు. రామానాయుడు స్టూడియో వేదికగా తెలుగు – మార్వాడీ సంప్రదాయాల కలబోతతో ఈ పెళ్లి జరిగింది. ఆ తర్వాత సందర్భమొచ్చినప్పుడల్లా తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారీ రొమాంటిక్‌ కపుల్‌. నెటిజన్లను కూడా ఇవి బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా తాజాగా రానా సతీమణి మిహీకా మరో పెళ్లి వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది.

పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌.. ‘పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌.. ప్రేమ, వెలుగు, జీవితం.. నాకు అన్నీ నువ్వే’ అంటూ పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకలోని అద్భుతమైన సంఘటనలను సమాహారంగా తీసుకుని ఈ వీడియో రూపొందించినట్లు తెలుస్తోంది. అందుకే మంచు లక్ష్మి, వెంకటేశ్‌ కూతురు ఆశ్రిత లాంటి ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు వీడియోపై లైకులు, ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రానా పవన్‌కల్యాణ్‌తో కలిసి ‘భీమ్లానాయక్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by miheeka (@miheeka)

Also read:

Rakul Preet Singh: జాకీతో నా పెళ్లి అప్పుడే.. మ్యారేజ్‌ ప్లాన్స్‌ను బయటపెట్టిన రకుల్‌…

Puja Kannan: హీరోయిన్‌గా సాయి పల్లవి సోదరి.. ఫస్ట్‌లుక్ విడుదల.. రిలీజ్‌ ఎప్పుడంటే..

MICHAEL Movie: సందీప్ కిషన్..విజయ్ సేతుపతి సినిమాలో విలన్‏గా ఆ స్టార్ డైరెక్టర్.. ప్రకటించిన మైఖేల్ టీం..