AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: జాకీతో నా పెళ్లి అప్పుడే.. మ్యారేజ్‌ ప్లాన్స్‌ను బయటపెట్టిన రకుల్‌..

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరసగా అవకాశాలు దక్కించుకుంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇటీవల తెలుగులో ఆమె నటించిన 'కొండపొలం' విమర్శకుల ప్రశంసలు పొందింది.

Rakul Preet Singh: జాకీతో నా పెళ్లి అప్పుడే.. మ్యారేజ్‌ ప్లాన్స్‌ను బయటపెట్టిన రకుల్‌..
Basha Shek
|

Updated on: Nov 22, 2021 | 3:53 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరసగా అవకాశాలు దక్కించుకుంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇటీవల తెలుగులో ఆమె నటించిన ‘కొండపొలం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. సినిమాల విషయాన్ని పక్కన పెడితే ఇటీవల తర పుట్టిన రోజున రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌ గురించి బయటపెట్టింది రకుల్‌. బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ తన బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనుందని చాలామంది భావించారు. జాకీతో కలిసి త్వరలోనే ఏడడుగులు నడుస్తుందనుకున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కొట్టి పారేస్తూ తన పెళ్లికి ఇంకా సమయం ఉందంటోందీ అందాల తార. ఈ మేరకు ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన తన పర్సనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

రకుల్‌ ప్రస్తుతం హిందీలో ‘థ్యాంక్స్‌ గాడ్‌’ అనే సినిమాలో నటిస్తోంది. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్న పంజాబీ బ్యూటీ తన కెరీర్‌, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘ సెలబ్రిటీల జీవితంపై చాలామంది దృష్టి ఉందని తెలుసు. అయినంతమాత్రాన అన్ని విషయాలు అందరితో పంచుకోలేం. మాకుంటూ కొంచెం పర్సనల్‌ స్పేస్‌ ఉంటుంది. ఇక జాకీతో నా రిలేషన్‌ షిప్‌ విషయాన్ని ఎందుకు ఓపెన్‌గా చెప్పానంటే.. అదొక అందమైన విషయం. అందరితో షేర్‌ చేసుకుంటే బాగుందనిపించింది. ఇక చాలామంది అనుకున్నట్లు నా పెళ్లికి అంత తొందరలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. ప్రొఫెషనల్‌ కెరీర్‌ పరంగా నేను సాధించాల్సిన లక్ష్యాలు, కలలు చాలానాఏ ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. చేసుకోవాలనుకున్నప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మీ అందరితో పంచుకుంటాను’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Also Read:

Puja Kannan: హీరోయిన్‌గా సాయి పల్లవి సోదరి.. ఫస్ట్‌లుక్ విడుదల.. రిలీజ్‌ ఎప్పుడంటే..

MICHAEL Movie: సందీప్ కిషన్..విజయ్ సేతుపతి సినిమాలో విలన్‏గా ఆ స్టార్ డైరెక్టర్.. ప్రకటించిన మైఖేల్ టీం..

Bigg Boss 5 Telugu: హౌస్‏లో నామినేషన్స్ హీట్.. ఆ ఇద్దరిపై విరుచుకుపడిన శ్రీరామచంద్ర..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..