PVR: సినీ లవర్స్‌కి పీవీఆర్ బంపరాఫర్.. రూ. 70కే ఐనాక్స్‌లో సినిమా చూసే ఛాన్స్..
అయితే ఇప్పటికీ కొన్ని సినిమాలు ఇంకా నేరుగా ఓటీటీ వేదికగానే విడుదలవుతున్నాయి. ఇక థియేటర్లలో వచ్చి నెల రోజుల్లోనే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్ల వైపు వచ్చే వారి సంఖ్య పూర్తి స్థాయిలో కవర్ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. దీనికి చెక్ పెట్టేందుకే, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మల్టీప్లెక్స్...
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడ్డట్లే వినోద రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా థియేటర్లపై తీవ్ర ప్రభావం పడింది. ఓటీటీ రంగం శరవేగంగా దూసుకుపోతే థియేటర్లు మాత్రం ప్రేక్షకులు లేక వెలవెలబోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు.
అయితే ఇప్పటికీ కొన్ని సినిమాలు ఇంకా నేరుగా ఓటీటీ వేదికగానే విడుదలవుతున్నాయి. ఇక థియేటర్లలో వచ్చి నెల రోజుల్లోనే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్ల వైపు వచ్చే వారి సంఖ్య పూర్తి స్థాయిలో కవర్ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. దీనికి చెక్ పెట్టేందుకే, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పీవీఆర్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే కనీసం రూ. 300 అయినా పెట్టాల్సిందే. అయితే పీవీఆర్ తీసుకొచ్చిన ఈ ఆఫర్‌తో కేవలం రూ. 70తోనే ఐనాక్స్‌లో సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. రూ. 700 చెల్లిస్తే 10 సినిమాలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ లెక్కన ఒక్కో సినిమాకు అయ్యే ఖర్చు రూ. 70 మాత్రమే.
#PVRINOX – Monthly Movie Pass – ₹700 pic.twitter.com/9wUx2SnUX0
— Aakashavaani (@TheAakashavaani) October 13, 2023
ఈ ఆఫర్ అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా రూ. 700 చెల్లిస్తే 30 రోజుల వ్యాలిడిటీతో 10 సినిమాలు చూడొచ్చు. అయితే ఇది కేవలం వీక్ డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే వర్తిస్తుంది. పీవీఆర్‌కు చెందిన ఏ థియేటర్‌లోనైనా ఈ పది సినిమాలు చూడొచ్చు. ప్రస్తుతం దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు ఉండడం కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పీవీఆర్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే పీవీఆర్ ఈ ఆఫర్ తీసుకురావడం ఇదే తొలిసారి కాదు, గతంలోనూ ఓసారి తీసుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..