పోలీసులను ఆశ్రయించిన పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. హీరో రామ్‌తో తాను తెరకెక్కిస్తోన్న ఇస్మార్ట్ శంకర్ సినిమా స్క్రిప్ట్‌ను బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి లీక్ చేశాడని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిని తొలగించాలని తమ టీమ్ కోరినప్పటికీ.. భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తరఫున పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్ సంస్థ పూరీ కనెక్ట్స్ […]

టాలీవుడ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. హీరో రామ్‌తో తాను తెరకెక్కిస్తోన్న ఇస్మార్ట్ శంకర్ సినిమా స్క్రిప్ట్‌ను బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి లీక్ చేశాడని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిని తొలగించాలని తమ టీమ్ కోరినప్పటికీ.. భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తరఫున పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్ సంస్థ పూరీ కనెక్ట్స్ మెంబర్ రవి పోలీస్ స్టేషల్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇస్మార్ట్ శంకర్ జూలై 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.


