కిల్లర్ రివ్యూ

బిచ్చగాడు మూవీతో సెన్సేషనల్ హిట్ సాధించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. నకిలీ, డా. సలీమ్ చిత్రాలతో డీసెంట్ విజయాలను దక్కించుకున్నాడు. బిచ్చగాడు చిత్రం తర్వాత విజయ్ ఆంటోని చేసిన భేతాళుడు, యమన్, ఇంద్రసేన, రోషగాడు వంటి సినిమాలు అంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయినప్పటికీ విజయ్ తన ప్రయత్నాలను మానుకోలేదు. తాను ఏ సినిమా చేసినా తెలుగు, తమిళ భాషల్లో తన సినిమాలను ఒకేసారి విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో మరో […]

కిల్లర్ రివ్యూ
Follow us

|

Updated on: Jun 07, 2019 | 5:22 PM

బిచ్చగాడు మూవీతో సెన్సేషనల్ హిట్ సాధించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. నకిలీ, డా. సలీమ్ చిత్రాలతో డీసెంట్ విజయాలను దక్కించుకున్నాడు. బిచ్చగాడు చిత్రం తర్వాత విజయ్ ఆంటోని చేసిన భేతాళుడు, యమన్, ఇంద్రసేన, రోషగాడు వంటి సినిమాలు అంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయినప్పటికీ విజయ్ తన ప్రయత్నాలను మానుకోలేదు. తాను ఏ సినిమా చేసినా తెలుగు, తమిళ భాషల్లో తన సినిమాలను ఒకేసారి విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో మరో ప్రయత్నమే కిల్లర్. ఈ మూవీలో విజయ్ ఆంటోనికి తోడుగా యాక్షన్ కింగ్ అర్జున్ జాయిన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ‘కిల్లర్‌’ విజయ్‌ ఆంటోనీకి తెలుగులో సక్సెస్‌ను అందించాడా? లేదా? అన్నది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ: కార్తికేయన్ (అర్జున్) ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ (విజయ్ ఆంటోని) కనిపిస్తాడు. ప్రభాకర్ వరుస హత్యలు చేసాడు అన్నది ఆరోపణ. ఈ నేపథ్యంలో కార్తికేయ ఆ హత్యలు చేసింది ప్రభాకరా కాదా తెలుసుకోవాలి. మరోవైపు ఆశీమ నర్వాల్ ఒక సాధారణ మధ్యతరగతి మహిళ గా కనిపిస్తుంది. ఆమెకు ఈ కథకి సంబంధం ఏంటి? అసలు హత్యలు చేసింది ప్రభాకరేనా? ఆ హత్యలు చేయడానికి వెనుక కారణమేంటి? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల తీరు: క్రైమ్ థ్రిల్ల‌ర్స్ చాలా సినిమాలే మ‌నం చూసుండొచ్చు. చిన్న థ్రెడ్‌ను బేస్ చేసుకుని దాని ఆధారంగానే సినిమా అంతా ర‌న్ అవుతుంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మే కిల్ల‌ర్‌. ఇక నటీనటుల విషయానికొస్తే ఇప్పటికే బిచ్చగాడు లాంటి సినిమాలతో సత్తా చాటుకున్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో కూడా అద్భుతంగా నటించారు. తన నటనతో పాత్రకు ప్రాణం పోశారని చెప్పొచ్చు. జెస్సీ, నాటకం వంటి తెలుగు సినిమాలో కనిపించిన ఆశీమ నర్వాల్ ఈ సినిమాతో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్‌లో మొదటి సినిమా అయినప్పటికీ ముందుగానే నటనలో అనుభవం ఉండటం వల్ల అది ఆమెకు బాగా ఉపయోగపడించదని చెప్పొచ్చు. ఈ సినిమాలో సీత పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ ఫర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఎప్పటిలాగే నాజర్ ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబరిచారు. సత్యం, సోమసుందరం, మయిల్సామి మరియు జాన్ విజయ్ కూడా తమ పాత్రల మేరకు బాగానే నటించారు.

విశ్లేషణ: ద‌ర్శ‌కుడు అండ్రూ లూయీస్‌ను ఈ విష‌యంలో అభినందించాలి. సినిమాను స్క్రీన్ ప్లే బేస్‌డ్ మూవీగా, స‌న్నివేశాల‌కు, క్లైమాక్స్‌లో లింకులు పెడుతూ తెర‌కెక్కించిన విధానం చాలా బావుంది. అస‌లు హీరో కిల్ల‌ర్‌గా మారాడు. అస‌లు హ‌త్య ఎక్క‌డ, ఎలా జరిగింద‌నే విష‌యాన్ని స‌స్పెన్స్‌గా చివ‌రి వ‌ర‌కు క్యారీ చేసిన తీరు బావుంది. హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దాంట్లో అత‌న్ని ఎక్క‌డా హైలైట్ చేసి చూపించ‌లేదు. పాత్ర‌లే హైలైట్‌గా అనిపిస్తాయి. సైమ‌న్ కింగ్ ట్యూన్స్ కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ముఖేష్ వైదీష్ సినిమాటోగ్ర‌ఫీ ద‌ర్శ‌కుడికి వెన్నుద‌న్నుగా నిలిచాయి. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను బాగా ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు సినిమా బాగా న‌చ్చుతుంద‌ని చెప్పొచ్చు.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..