ఆ హీరోలపై నాకు చాలా గౌరవం ఉంది: సూర్య

ఎస్‌జే సూర్య దర్శకుడి నుంచి నటుడిగా మారిన తర్వాత ఇటీవల కాలంలో ఎక్కువగా విలన్ పాత్రలలో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా స్పైడ‌ర్‌, మెర్స‌ల్ చిత్రాల‌లో సూర్య విలన్‌గా త‌న న‌ట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. అయితే అజిత్ తాజా చిత్రంలోను సూర్య విల‌న్‌గా క‌నిపించ‌నున్నార‌ని కొన్నాళ్ళుగా ప్రచారం జ‌రుగుతూ వ‌స్తుంది. అయితే ఈ వార్తలపై సూర్య తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తల అజిత్ 60వ చిత్రంలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు. అజిత్ స‌ర్, […]

ఆ హీరోలపై నాకు చాలా గౌరవం ఉంది: సూర్య
Anil kumar poka

|

Jun 07, 2019 | 5:07 PM

ఎస్‌జే సూర్య దర్శకుడి నుంచి నటుడిగా మారిన తర్వాత ఇటీవల కాలంలో ఎక్కువగా విలన్ పాత్రలలో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా స్పైడ‌ర్‌, మెర్స‌ల్ చిత్రాల‌లో సూర్య విలన్‌గా త‌న న‌ట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. అయితే అజిత్ తాజా చిత్రంలోను సూర్య విల‌న్‌గా క‌నిపించ‌నున్నార‌ని కొన్నాళ్ళుగా ప్రచారం జ‌రుగుతూ వ‌స్తుంది. అయితే ఈ వార్తలపై సూర్య తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తల అజిత్ 60వ చిత్రంలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు. అజిత్ స‌ర్, బోని క‌పూర్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. ద‌యచేసి వారి చిత్రాల‌కి సంబంధించి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయోద్దంటూ సూర్య తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu