AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

pawan kalyan: పవన్‌ కళ్యాణ్‌, పోసాని కృష్ణ మురళి.. మధ్యలో నట్టి కుమార్‌.. కొనసాగుతోన్న వివాదం.

pawan kalyan: రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల తాలుకూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తనపై కోపంతో వైసీపీ ప్రభుత్వం..

pawan kalyan: పవన్‌ కళ్యాణ్‌, పోసాని కృష్ణ మురళి.. మధ్యలో నట్టి కుమార్‌.. కొనసాగుతోన్న వివాదం.
Narender Vaitla
|

Updated on: Oct 01, 2021 | 1:31 PM

Share

pawan kalyan: రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల తాలుకూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తనపై కోపంతో వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై కక్ష కడుతోందని, అందులో భాగంగానే టికెట్లు ప్రభుత్వం అమ్ముతోందనే సరికొత్త చర్చకు దారి తీశారు పవన్‌ కళ్యాణ్‌. ఇక పవన్‌ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా రంగంలోకి దిగిన నటుడు పోసాని పవన్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనను పవన్‌ అభిమానులు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారంటూ ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ పవన్‌పై మాటల దాడికి దిగారు పోసాని. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ వర్సెస్‌ పోసాని అన్నట్లు వివాదం మారింది. ఈ క్రమంలోనే పవన్‌ ఫ్యాన్స్‌ పోసాని ఇంటిపై రాళ్ల దాడికి కూడా దిగారు. ఇప్పుడీ వివాదంలోకి నిర్మాత నట్టి కుమార్‌ వచ్చి చేరారు.

తాజాగా పవన్‌, పోసానీల వ్యవహారంపై స్పందించిన నట్టికుమార్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళి ఇంటి మీద పవన్‌ ఫ్యాన్స్‌ చేసిన దాడిని ఖండిస్తున్నానని తెలిపారు. ఎవరు మాట్లాడినా మధ్యలోకి కుటుంబాలాను తీసుకొస్తున్నారని ఆరోపించిన నట్టి కుమార్.. అభిమానులు కూడా మీ నాయకులకు మంచి పేరు వచ్చేలా ప్రవర్తించాలని హితవు పలికారు. తెలంగాణకు చెందిన జనసేన నాయకుడు ఆంధ్ర, తెలంగాణ అనే భేదం తీసుకువస్తున్నారని.. ఇదిలా చాలా తప్పని, మనమందరం కలిసి ఉన్నామని తప్పుగా మాట్లాడవద్దంటూ హితవు పలికారు. ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ప్రేక్షకుల నుంచి ఎక్కువ రేట్లు వసూలు చేస్తుంటే ప్రభుత్వాలు, అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఏ సమావేశం జరిగినా వారే ఎందుకు పాల్గొంటారు.? సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఆ ఆరుగురేనా.? చిన్న నిర్మాతలను సమావేశాలకు ఎందుకు పిలవరంటూ ప్రశ్నలు సంధించారు.

ఇక జగన్‌ అందరినీ అందరివాడిలా చూస్తారని తెలిపిన నట్టికుమార్.. పవన్ కళ్యాణ్‌ ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్‌ ఇందులో ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయం లేదని, కానీ రాజకీయంగా మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు నిర్మాతలు పవన్‌కు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని విమర్శించారు. ఇక ఛాంబర్‌ నుంచి వచ్చి లేఖ అందిరతో చర్చించి రాయలేదని.. కేవలం ప్రెసిడెంట్‌, కార్యదర్శి మాత్రమే పంపించారని నట్టికుమార్‌ ఆరోపించారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా.? లేదా ఇంకా ఇలానే కొనసాగుతూనే ఉంటుందా వేచి చూడాలి.\

Also Read: Acai Berries Benefits: అకాయ్ బెర్రీస్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అకాల వృద్ధాప్యానికి చెక్

Viral News: వామ్మో… ఇదేందయ్యా ఇది.. “ఆ బిస్కెట్లు తినకపోతే పిల్లలకు కీడు”.. షాపుల ముందు క్యూ

Amarinder Singh: ప్రధానితో సమావేశం కానున్న మాజీ సీఎం అమరీందర్ సింగ్.. ఆ సమస్యపై ఫోకస్..

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే