మ్యారేజ్ అనంతరం సింగర్ సునీత చాలా మారిపోయారు. అంతకుముందు ఆమె చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. ఏవైనా మ్యూజికల్ ఈవెంట్స్ లేదా ప్రొగ్రామ్స్‌లో తప్ప బయట ఎక్కువగా కనిపించకపోయేవారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా అప్‌డేట్స్ ఏవీ ఉండేవి కాదు. కానీ ఆమె ఇప్పుడు చాలా యాక్టివ్ అయ్యారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. కాస్త మితిమీరి అతిగా కామెంట్లు చేసేవాళ్లకి కూడా గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు సోషల్ మీడియాకు ఎంత స్పేస్ ఇవ్వాలో తెలుసని, తన వ్యక్తిగత జీవితాన్ని ఎంత వరకు ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే దానిపై స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. అందుకే తాను వెకేషన్లకు, టూర్లకు ఎక్కడికైనా వెళ్తే.. వెంటనే ఫోటోలను షేర్ చేయనని.. వెకేషన్‌కు వెళ్లి వచ్చాక ఎప్పుడో అలా గుర్తుకు వచ్చినప్పుడు వాటిని పోస్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా ఈ పాటల కోయిలమ్మ కొన్ని ఫోటోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. వాటితో పాటు ఓ కామెంట్ కూడా చేసింది. దాన్ని బట్టి చూస్తే.. సునీత గోవాలో నేచర్‌ను బాగా ఎంజాయ్ చేసినట్టు అర్థమవుతోంది. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తనలా ప్రకృతిని ప్రేమించేవాళ్లకు గోవా అనేది బెస్ట్ స్పాట్ అని పేర్కొన్నారు సునీత. తన స్నేహితురాళ్లు పద్మజ, అన్నపూర్ణల గురించి కూడా ప్రస్తావించారు. కాగా గోవా ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసిన కుందనపు బొమ్మ సునీత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
Also Read:ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు
Viral News: కలికాలం అంటే ఇదే కదా..! రైస్ కుక్కర్‌తో పెళ్లేంటి గురూ..!