AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఎంతో ఆతృతగా ఎదురు చూస్తొన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ వచ్చేది ఆ రోజేనా.? ఈ వార్తలోనైనా నిజం ఉందా.?

RRR Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ.. ఆ మాటకొస్తే ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం..

RRR Movie: ఎంతో ఆతృతగా ఎదురు చూస్తొన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ వచ్చేది ఆ రోజేనా.? ఈ వార్తలోనైనా నిజం ఉందా.?
Narender Vaitla
|

Updated on: Oct 01, 2021 | 1:55 PM

Share

RRR Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ.. ఆ మాటకొస్తే ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం.. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి బడా హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్లు, దోస్తీ పాటకు భారీ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైన ఇప్పటికే దాదాపు మూడేళ్లు గడుస్తోంది. దీంతో సినిమా విడుదలపై ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఇక గ్రాఫిక్స్‌ కోసం ఎక్కువ సమయం తీసుకుంటుండడంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

ఇదిలా ఉంటే తొలుత ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే వాయిదా వేస్తూ చిత్ర యూనిట్‌ నిర్ణయం తీసుకుంది. ఇక అనంతరం క్రిస్మస్‌ కానుకగా విడుదల అవుతుందన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇందులో కూడా నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి మరో కొత్త తేదీ వినిపిస్తోంది. అదే జనవరి 7.. సంక్రాంతి కానుకగా ఆర్‌.ఆర్.ఆర్‌ ప్రేక్షకుల ముందుకు రానుందననేది తాజా సమాచారం సారాంశం. మరి ఈ తేదీ అయినా పక్కా అవుతుందా… అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం.. సంక్రాంతిని టార్గెట్‌ చేసుకొని ఇప్పటికే భీమ్లా నాయక్‌, సర్కారు వారి పాట, రాధేశ్యామ్‌, ఆచార్య, అఖండ, బంగార్రాజు, ఎఫ్‌3 వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఇన్ని సినిమాల నడుమ ఆర్‌.ఆర్‌.ఆర్‌ కూడా వస్తుందా.? లేదా సమ్మర్‌కు పోస్ట్‌ పోన్‌ అవుతుందో చూడాలి.

ఇక ఈ వార్తే కనక నిజమైతే 2022ను టాలీవుడ్‌ పెద్ద సినిమాతో ప్రారంభించనున్నందమాట. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రంలో అటు బాలీవుడ్‌ నుంచి ఇటు కోలివుడ్‌ వరకు అన్ని భాషలకు చెందిన నటీనటులు ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కుమ్రం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్‌ చరణ్‌ అల్లూరి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి ఈ సినిమాపై పడింది.

Also Read: pawan kalyan: పవన్‌ కళ్యాణ్‌, పోసాని కృష్ణ మురళి.. మధ్యలో నట్టి కుమార్‌.. కొనసాగుతోన్న వివాదం.

Soujanya Suicide: ఆ నటి సూసైడ్ వెనుక రీజనేంటి.. సంచలనంగా మారిన సౌజన్య మృతి

No Time To Die: 50 ఏళ్లు గడుస్తోన్నా చెక్కు చెదరని బాండ్‌ బ్రాండ్‌.. ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతోన్న ‘నో టైమ్‌ టు డై’..