Amarinder Singh: ప్రధానితో సమావేశం కానున్న మాజీ సీఎం అమరీందర్ సింగ్.. ఆ సమస్యపై ఫోకస్..
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇవాళ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే..
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసకుంటున్నాయి. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇవాళ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన కెప్టెన్ శుక్రవారం మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయితే గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి ఆయన ప్రధాని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ప్రధానితో కలిసిన సమయంలో పంజాబ్ రైతుల సమస్యలపై చర్చించనున్నారు.
అమరీందర్ సింగ్ చెప్పారు – బిజెపిలో చేరడం లేదు
ఇదిలా ఉండగా తాను బిజెపిలో చేరడం లేదని కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇప్పటికే చెప్పారు. అయితే తాను కాంగ్రెస్‌లో ఉండనని కూడా ఆయన స్పష్టం చేశారు. అలా అని తాను బిజెపిలో కూడా చేరడం లేదని అన్నారు. తనను విశ్వసించని, అవమానించిన పార్టీలో తాను కొనసాగడం లేదని తేల్చి చెప్పారు. పంజాబ్ సీఎం పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తనను అవమానకరంగా తప్పించిందని కెప్టెన్ భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో సిద్ధూకు పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని కూడా కెప్టెన్ వ్యతిరేకిస్తున్నారు. సిద్ధూ పాక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారని, భారత్‌కు ప్రమాదకారని కెప్టెన్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
అజిత్ దోవల్‌తో సమావేశం
కెప్టెన్ సింగ్ గురువారం ఉదయం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ని ఆయన నివాసంలో కలిశారు. పంజాబ్ సరిహద్దులో భద్రతా పరిస్థితి .. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభంపై ఇద్దరి మధ్య చర్చించించారు. పంజాబ్ ఇప్పటికీ తనదేనని అమరీందర్ సింగ్ అన్నారు. అందుకే హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్‌ని కలిసానని అన్నారు.
కొత్త పార్టీ ఏర్పాటు..
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మరో 15 రోజుల్లో కొత్త రాజకీయ పార్టీ స్థాపించే అవకాశాలున్నాయని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైఖరితో విసిగిపోయిన అమరీందర్ సింగ్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల రాజీనామా చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 12 మంది కాంగ్రెస్ నాయకులు అమరీందర్ సింగ్ తో టచ్ లో ఉన్నారని సమాచారం. అమరీందర్ పెట్టబోయే కొత్త పార్టీలో అతని మద్ధతుదారులైన కాంగ్రెస్ నేతలు చేరతారని అంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి: SBI Car Loan: కారు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. జీరో ప్రాసెసింగ్ ఛార్జ్.. ఇంట్లో కూర్చుని తీసుకోండి..
TS RTC: సాహో సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు..